నవతెలంగాణ – జుక్కల్
మండలంలోని మహమ్మదాబాద్ గ్రామంలో ఉచిత గాలికుంటు వ్యాధి టీకాల శిబిరాన్ని గ్రామ సర్పంచ్ సూర్నార్ శకుంతల బాలు బుధవారం ప్రారంభించారని మండల పశువైద్యాధికారి పండరినాథ్ తెలిపారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ శకుంతల బాలు మాట్లాడుతూ.. పశుపోషకులకు, ప్రభుత్వం బాధ్యతగా తీసుకొని గ్రామాలలో ఉచిత గాలికుంటు వ్యాధి టీకాలను వేయిస్తుందని అన్నారు. ఈ నెల 10 నుండి ఏప్రిల్ 9వ వరకు గేదెలు, పశువులకు ఉచిత గాలికుంటు వ్యాధి నిరోధక టీకాలను వేస్తామని తెలిపారు.
మండల వెటర్నరీ డాక్టర్ పండరినాథ్ మాట్లాడుతూ.. పశు వైద్య సిబ్బంది ముందుగా నిర్ణయించిన తేదీల ప్రకారం గ్రామాలకు వచ్చి ఉచిత గాలికుంటు వ్యాధి టీకాలు అందిస్తారని తెలిపారు. ఈ అవకాశాన్ని మండలంలోని మహ్మదాబాద్ గ్రామ పంచాయతీ పరిధిలోని గ్రామాల పశుపోషకులు సద్వినియోగపర్చకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ సుర్నార్ శకుంతల బాలు, ఉప సర్పంచ్ పోతుల లక్ష్మణ్, జిపి కార్యదర్శి జీవన్ రాథోడ్, వెటర్నరీ మండల వైద్యుడు పండరినాథ్, గోపాల మిత్రులు, కారో భారీ, పశుపోషకులు తదితరులు పాల్గొన్నారు.



