Thursday, March 12, 2026
E-PAPER
Homeజాతీయంరామా.. కనవేమిరా!

రామా.. కనవేమిరా!

- Advertisement -

– అయోధ్యను తాకిన వంటగ్యాస్‌ కొరత
– అమావా ఆలయంలోని ‘రామ్‌ రసోయీ’ని తాత్కాలింగా మూసివేత
– ప్రకటించిన ఆలయ నిర్వాహకులు
లక్నో: ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయిల్‌ దాడులతో ప్రపంచవ్యాప్తంగా చమురు, గ్యాస్‌ సరఫరాకు అంతరాయం నెలకొన్న విషయం తెలిసిందే. దేశంలో చమురు, గ్యాస్‌ నిల్వలు సరిపడా ఉన్నాయని ఓవైపు కేంద్రం చెబుతున్నప్పటికీ.. పలు ప్రాంతాల్లో గ్యాస్‌ కొరత ఆందోళన కలిగిస్తోంది. ఈ ప్రభావం అయోధ్య ఆలయాన్ని తాకింది. ఎల్‌పీజీ సిలిండర్ల కొరత కారణంగా అమావా ఆలయంలోని రామ్‌ రసోయీ (అన్నదాన కేంద్రం)ను తాత్కాలికంగా మూసివేస్తున్నట్టు ఆలయ నిర్వాహకులు ప్రకటించారు. ఈ మేరకు అన్నదాన కేంద్రం వద్ద నోటీసులు అంటించారు.

మరోవైపు వాణిజ్య సిలిండర్ల కొరత కారణంగా ముంబయి, ఢిల్లీ, బెంగళూరు సహా దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లోని కొన్ని హోటళ్లు, రెస్టారెంట్లు తాత్కాలికంగా మూతపడ్డాయి. ఎల్‌పీజీ కొరత వల్ల ఢిల్లీ హైకోర్టులోని క్యాంటీన్‌ను తాత్కాలికంగా మూసివేస్తున్నట్టు అధికారులు వెల్లడించారు. ఈ పరిణామాల నేపథ్యంలో బ్లాక్‌ విక్రయాలను అరికట్టేందుకు కేంద్రం ఇప్పటికే చర్యలు చేపట్టింది. ఎల్పీజీ సిలిండర్ల బుకింగ్‌ వ్యవధిని ప్రస్తుతమున్న 21 రోజుల నుంచి 25 రోజులకు పెంచింది. వాణిజ్య సిలిండర్ల సరఫరాను సమీక్షించేందుకు చమురు మంత్రిత్వశాఖ ఓ కమిటీని ఏర్పాటుచేసింది.

మా హోటళ్లలో మధ్యాహ్న భోజనం నిలిపివేస్తున్నాం: ఐటీసీ
పశ్చిమాసియాలో కొనసాగుతోన్న సంక్షోభం కారణంగా..వంట గ్యాస్‌ కొరత ఏర్పడుతుండడంతో పలు ప్రాంతాల్లోని తమ హోటళ్లలో రేపటి నుంచి లంచ్‌, డిన్నర్‌ అందుబాటులో ఉండదని ప్రముఖ హోటల్‌ ఐటీసీ వెల్లడించింది. తాత్కాలికంగా ఈ సేవలను నిలిపివేస్తున్నట్టు తెలిపింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -