- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: మహారాష్ట్ర అసెంబ్లీకి గుర్తు తెలియని వ్యక్తుల నుండి బాంబు బెదిరింపు మెయిల్ రావడంతో తీవ్ర కలకలం రేగింది. ఈ మెయిల్ అందిన వెంటనే బాంబ్ స్క్వాడ్ సంఘటనా స్థలానికి చేరుకుని తనిఖీలు చేపట్టింది. అధికారులు అప్రమత్తమై అక్కడున్న వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఇటీవల దేశవ్యాప్తంగా ఇలాంటి బెదిరింపులు తరచుగా వస్తున్న నేపథ్యంలో.. ఈ బెదిరింపు నిజమా లేక కల్పితమా అనేది విచారణలో తేలనుంది.
- Advertisement -



