- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్ : శంషాబాద్ లోని పెద్ద షాపూర్ దగ్గర గురువారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు ఇంటర్ విద్యార్థులు మృతి చెందారు. కొత్తూరు మండల కేంద్రానికి చెందిన బిక్కి సింగ్, సురజ్లు పరీక్ష రాయడానికి బైక్పై వెళ్తుండగా, ఎదురుగా వచ్చిన లారీ ఢీకొనడంతో ఈ ఘోరం జరిగింది. మంత్రి వాకిటి శ్రీహరి ఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. తల్లిదండ్రులు కన్నీరుమున్నీరయ్యారు.
- Advertisement -



