నవతెలంగాణ – హైదరాబాద్: నిర్మల్ జిల్లా కొండాపూర్ గ్రామ శివారులో జాతీయ రహదారిపై టైరు పేలి డీసీఎం వ్యాన్ బోల్తా పడటంతో ఇద్దరు మృతి చెందగా పలువురికి తీవ్ర గాయాలు అయ్యాయి. ఆదిలాబాద్ జిల్లా సిరికొండ మండలం సోన్ పల్లి గ్రామానికి చెందిన సుమారు 20 మంది ఆర్మూర్‌లో జరిగే పెళ్లికి హాజరయ్యేందుకు గురువారం ఉదయం ఐచర్ వాహనంలో బయలుదేరారు. వాహనం కొండాపూర్ గ్రామ సమీపానికి చేరుకోగానే ముందు టైరు ఒక్కసారిగా పేలడంతో వాహనం అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందగా 15 మందికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను ఆదిలాబాద్ రిమ్స్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మృతులను బరడే లక్ష్మణ్ (45), తులసీదాస్ (38) గా గుర్తించారు. క్షతగాత్రుల్లో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.
టైరు పేలి డీసీఎం వ్యాన్ బోల్తా.. ఇద్దరు మృతి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



