Thursday, March 12, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్వార్డు సభ్యులు ప్రతి ఒక్కరు శిక్షణ తరగతులకు హాజరు కావాలి

వార్డు సభ్యులు ప్రతి ఒక్కరు శిక్షణ తరగతులకు హాజరు కావాలి

- Advertisement -

నవతెలంగాణ – జుక్కల్  : జుక్కల్ మండల కేంద్రంలోని మొదటి విడత గ్రామపంచాయతీ వార్డు సభ్యుల శిక్షణ తరగతులకు గురువారం నాడు 84 మాజీ సభ్యులు హాజరయ్యారని మండల పరిషత్ సిబ్బంది గంగాధర్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శిక్షకులుగా నాగయ్య, దివాకర్, అశోక్ గౌడ్, నవీన్ , జిపి చట్టాలపై వార్డు సభ్యులకు అవగాహన పరచడం జరిగింది. ఈ సందర్భంగా వార్డు సభ్యులకు ట్రైనర్లు మాట్లాడి తెలుపుతూ గ్రామపంచాయతీని విధులు బాధ్యతలు , సర్పంచ్, ఉప సర్పంచ్ , వార్డు సభ్యుల విధులు ,బాధ్యతలు,  గ్రామపంచాయతీ స్థాయి సంఘాలు , పంచాయతీ కార్యదర్శి విధులు , బాధ్యతలు గురించి వివరించడం జరిగిందని అన్నారు. ఈ కార్యక్రమంలో మండలంలోని మొదటి విడతలో ఉన్న 11 గ్రామ పంచాయతీల వార్డు సభ్యులు మండల పరిషత్ సిబ్బంది జూనియర్ అసిస్టెంట్ ,సీనియర్ అసిస్టెంట్ , కంప్యూటర్ ఆపరేటర్లు తదితరులు పాల్గొన్నారు. 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -