నవతెలంగాణ-భువనగిరి కలెక్టరేట్ : కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ప్రారంభించ బడిన ప్రజల ప్రాణాలను కాపాడే అత్యవసర వైద్య సేవలైన 108 అంబులెన్స్ సేవల్లో పనిచేస్తున్న ఉద్యోగులు ప్రస్తుతం తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
ఆరు నెలలుగా జీతాలు రాక…
గత ఆరు నెలల నుండి జీతాలు చెల్లించిన అవి సకాలంలో రాకపోవడంతో ఉద్యోగుల కుటుంబాలు మానసిక ఆందోళనకు గురవుతున్నారు. పగలు రాత్రి తేడా లేకుండా ప్రమాదాలు, అనారోగ్య పరిస్థితుల్లో ప్రజలకు సేవలందిస్తూ ప్రాణాలను రక్షిస్తున్న 108 ఉద్యోగుల జీతాల పట్ల ప్రజా ప్రభుత్వం నిర్లక్ష్యం వ్యవహరించడం వల్ల, జీతాలు ఆలస్యం కావడం వల్ల పిల్లల చదువులు, ఇళ్ల అద్దెలు, బ్యాంకు లోన్లు, మరియు కుటుంబ అవసరాలు తీర్చుకోవడం అప్పులు చేసి అవసరాలు తీర్చుకుంటున్నారు..
అత్యవసర వైద్య సేవలలో కీలక పాత్ర పోషిస్తున్న 108 ఉద్యోగుల్లో పేద, మధ్య తరగతి వారే ఎక్కువ శాతం మంది ఉండటం వల్ల తీవ్రంగా ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సరైన సమయంలో జీతాలు వస్తే మరింత ఉత్సాహంగా క్షతగాత్రులకు వైద్య మెరుగైన సేవలు అందించేందుకు ఉత్సాహం చూపుతారు. కావున ప్రభుత్వం తక్షణమే స్పందించి ప్రతి నెలా ఒకటవ తారీఖున జీతాలను చెల్లించేలా స్పష్టమైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఉద్యోగుల నుంచి ప్రజా ప్రభుత్వానికి విజ్ఞప్తులు వస్తున్నాయి..108 సర్వీసులు అందించే సంస్థకు ప్రభుత్వం తరఫునుంచి సకాలంలో విడుదల కావలసిన నిధులు చాలా ఆలస్యంగా అందుతున్నాయి.
గత కొంతకాలంగా ఉద్యోగస్తులకు సకాలంలో జీతాలు రావడం లేదు.దీంతో నిర్వహణ భారంగా మారింది. ఇకనైనా ప్రభుత్వం దీనిని గమనించి నిధులు విడుదల చేయాలని సంఘాల నాయకులు, ప్రజలు కోరుతున్నారు.



