– వేసిన బోల్రు సక్రమంగా పోయకపోవడంతో ఇబ్బందులు పడుతున్న రైతన్నలు
– పెట్టుబడికూడా డబ్బులు వస్తాయో రాదంటున్న రైతులు
– అద్దె ట్రాక్టర్ తో పొలంలోకి నీరును అందిస్తున్న రైతులు
నవతెలంగాణ- మిరుదొడ్డి
మండుతున్న ఎండలకు పంటలు ఎండు ముఖం పట్టాయి. వేసిన బోర్రు సక్రమంగా నీరు పోయకపోవడంతో రైతన్నలు తీవ్ర ఇబ్బందులు గురవుతున్నారు. వేసిన పంటకు పెట్టుబడి వస్తుందో రాదని అన్న భయంతో రైతులు వారి పంటను కాపాడుకోవడానికి నీటిని అద్దె ట్రాక్టర్లతో కొనుగోలు చేసి వరి పంట పొలాలకు నీరును అందిస్తున్నారు. రైతులు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతులకు కాలువల ద్వారా నీరు అందిస్తున్న విషయం తెలిసిందే కానీ దుబ్బాక నియోజకవర్గం లోని మిరుదొడ్డి మండలంలో రైతులకు కాలువల ద్వారా నీరు అందకపోవడంతో తీవ్ర ఇబ్బందులు గురవుతున్నారు. మల్లన్న సాగర్ నుండి రైతులకు నీరు అందించడంలో ప్రభుత్వం తీవ్రంగా ఉఫలం అయిందని రైతన్నలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సిద్దిపేట జిల్లా మిరుదొడ్డి మండలం పెద్ద చెప్పాలా గ్రామంలో రైతులు పంట పొలాలకు నీటి ట్యాంకర్ ద్వారా నీరు అందిస్తున్నారు. ప్రభుత్వం క్షత్రియ అధికారులు స్పందించి మిరుదొడ్డి మండలంలో నష్టపోయిన రైతులకు పరిహారం అదే విధంగా చూడాలని రైతన్నలు కోరుతున్నారు. రైతులను ప్రభుత్వం ఆదుకోకుంటే ఆత్మహత్య శరణం అంటున్న రైతులు.
పంట నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలి: అశోక్ లింగుపల్లి రైతు
వేసిన పంట పూర్తిగా నష్టపోవడంతో పెట్టుబడి కూడా రావడం లేదు. పొలం దున్ని నాటు వేసేసరికి సుమారుగా 40 వేల రూపాయలు ఖర్చు అయ్యాయి. వేసిన వరి పంటకు నీరు సక్రమంగా అందడం లేదు. మల్లన్న సాగర్ కాలువ ద్వారా నీరును అందిస్తారని అధికారులు గొప్పలు చెప్తున్నారు కానీ ఇప్పటికీ కాలువలు పూర్తిస్థాయిలో కాలువలు నిర్మాణం కాకపోవడంతో నీరు అందడం లేదు. కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే రైతుల పట్ల శ్రద్ధ తీసుకొని కాలువలు పూర్తయ్య దిశల చూడాలి. వేసిన వారి పంట పూర్తిగా నష్టపోవడంతో నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలి.



