నవతెలంగాణ పెద్దకొడప్ గల్
మండలంలోని కాటేపల్లి జిల్లా పరిషత్ పాఠశాలలో గురువారం రోజున బాన్సువాడ షీ టీం ఇన్చార్జ్ పార్వతి ఎంఈఓ ప్రవీణ్ కుమార్ కలిసి విద్యార్థులకు షి టీం పైనఅవగాహన కల్పించారు. ఈ సందర్భంగా షీ టీమ్ ఇన్చార్జి పార్వతి మాట్లాడుతూ బాలికల భద్రతే షీ టీమ్స్ లక్ష్యమన్నారు. పాఠశాలలో కానీ, బయట ఎక్కడైన ఆకతాయిలు బాలికలను భయాందోళనలకు గురిచేసినా, వేధించినా, ఇబ్బందికరంగా మాట్లాడిన వెంటనే టోల్ ఫ్రీ నంబర్ 100, 181 కు సమాచారం ఇవ్వాలని తెలిపారు.
బాలికలను, మహిళలను వేధింపులకు గురిచేస్తే చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. విద్యార్థులు చిన్న విషయాలకు ఆవేద నకు గురికాకూడదని మంచి ఆలోచనతో చదువుకోవాలని సూచించారు. తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు పిల్లల ప్రవర్తనపై కూడా దృష్టి సారించాల న్నారు. క్రమశిక్షణతో ఉండేలా శ్రద్ధ తీసుకోవాలని సూచించారు. కార్యక్ర మంలో ఎంఈఓ ప్రవీణ్ కుమార్ ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.



