Thursday, March 12, 2026
E-PAPER
Homeజిల్లాలుయూరియా కోసం కేంద్రానికి తుమ్ముల లేఖ‌

యూరియా కోసం కేంద్రానికి తుమ్ముల లేఖ‌

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్‌: ఈ ఏడాది ఖరీఫ్ కోసం ముందస్తుగా యూరియా నిల్వలు సిద్ధం చేయాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది ఈ నేపథ్యంలో రానున్న మూడు నెలలకు.. ఆరు లక్షల మెట్రిక్ టన్నులు యూరియా కేటాయించాలని కేంద్రాన్ని రాష్ట్ర ప్రభుత్వం కోరింది. ఏప్రిల్, మే, జూన్‌కు నెలకు 2 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా అవసరమని స్పష్టం చేసింది. ఈ మేరకు కేంద్ర మంత్రి జేపీ నడ్డాకు లేఖ రాసినట్లు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గురువారం హైదరాబాద్‌లో వెల్లడించారు. ఖరీఫ్ ప్రారంభానికి రాష్ట్రంలో సుమారు 50 వేల టన్నుల ప్రారంభ నిల్వలు మాత్రమే ఉండే అవకాశం ఉందన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -