Thursday, March 12, 2026
E-PAPER
Homeకరీంనగర్అధికారులను నిలదీసిన సర్పంచ్..

అధికారులను నిలదీసిన సర్పంచ్..

- Advertisement -

నవతెలంగాణ-తంగళ్ళపల్లి : గ్రామాల అభివృద్ధి కోసం నిధులు విడుదల చేయకపోతే గ్రామాలు అభివృద్ధి జరిగేది ఎలా అంటూ అధికారులను ఓ సర్పంచ్ నిలదీంచారు. 99 రోజుల ప్రజా పాలన ప్రణాళికలో భాగంగా గురువారం తంగళ్ళపల్లి మండలం అగ్రికల్చర్ కళాశాలలో జిల్లాలోని సర్పంచులు, వార్డు కౌన్సిలర్లు, మున్సిపల్ చైర్ పర్సన్ లతో అధికారులు ఒక్కరోజు శిక్షణ కార్యక్రమంలో తంగళ్ళపల్లి మండలం పద్మనగర్ గ్రామ సర్పంచ్ మూర నిర్మల అధికారులను నిలదీశారు. గ్రామాల అభివృద్ధి చేయాలంటూ అధికారులు ఎందరో ఉపన్యాసాలు ఇచ్చారు కానీ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గ్రామాల అభివృద్ధి కోసం నిధులు మంజూరు చేయకపోతే గ్రామాల అభివృద్ధి ఎలా జరుగుతుందని ప్రశ్నించారు. ప్రతి పనికి సర్పంచ్  ముందుండాలని అన్నప్పుడు నిధులు లేకపోతే పనిచేసేది ఎలా అని అధికారులను నిలదీశారు. రాష్ట్ర ప్రభుత్వం స్పందించి అన్ని గ్రామాలకు నిధులను విడుదల చేయాలని ఈ సందర్భంగా వారి డిమాండ్ చేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -