- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: దేశంలో గ్యాస్ సరఫరాపై ఆందోళన అవసరంలేదని కేంద్ర పెట్రోలియం, నేచురల్ గ్యాస్ శాఖ వెల్లడించింది. LPG ఉత్పత్తి పెంపు, సరఫరాలో ఇళ్లకే ప్రాధాన్యం ఇస్తున్నామని తెలిపింది. బుకింగ్ చేసుకున్న రెండున్నర రోజుల్లోనే సిలిండర్లు డెలివరీ చేస్తున్నామని, ప్రజలు హడావుడిగా బుకింగ్స్ చేసుకుని సిలిండర్లు నిల్వ ఉంచుకోవాల్సిన అవసరంలేదని స్పష్టం చేసింది. అవసరమైన సమయంలోనే ఆన్లైన్లో బుకింగ్ చేసుకోవచ్చని పేర్కొంది.
- Advertisement -



