Friday, March 13, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్గ్రామస్తుల ప్రోత్సాహం నాకెంతో శక్తినిచ్చింది: జిపి కార్యదర్శి భూమేష్

గ్రామస్తుల ప్రోత్సాహం నాకెంతో శక్తినిచ్చింది: జిపి కార్యదర్శి భూమేష్

- Advertisement -

– ఉద్యోగరీత్యా బదిలీ సర్వసాధారణ మే.

నవతెలంగాణ – జుక్కల్

జుక్కల్ మండలంలోని కంటాలి గ్రామ జిపి కార్యదర్శిగా గత రెండేళ్లుగా విధులు నిర్వహించి బదిలీపై నిజామాబాద్ జిల్లాకు వెళ్తున్న భూమేష్ ను గ్రామస్తుల ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించి సత్కరించారు. ఈ సందర్భంగా గ్రామానికి చెందిన అరుణ్ పటేల్ బృందం కలిసి జిపి కార్యదర్శి శాలువాతో సత్కరించి జ్ఞాపికలను అందజేశారు. అనంతరం అరుణ్ పటేల్ మాట్లాడుతూ గత రెండేళ్లుగా గ్రామంలో విధులు నిర్వహించిన జిపి కార్యదర్శి గ్రామస్తులకు ఎటువంటి సమస్యలు తలెత్తకుండా నిత్యం అందుబాటులో ఉన్నారని తెలిపారు. మారుమూల జుక్కల్ ప్రాంతంలో సౌకర్యాలు లేకున్నా కష్టపడి తమ గ్రామస్తులకు సహాయ సహకారాలు అందించారని అన్నారు. వృత్తిరీత్యా ఎటువంటి నిర్లక్షానికి తావులేకుండా నిబద్ధతగా విధులు నిర్వహించారని గ్రామస్తులు అన్నారు.

ఉద్యోగ రీత్యా గ్రామస్తులు గ్రామాలకు చాలామంది వస్తూపోతూ ఉంటారు అధికారులు కానీ గ్రామం గురించి ఆలోచించి ప్రజల ఆలోచన విధానాలకు అనుగుణంగా వారి కష్టసుఖాలను శోధించి సహాయం చేయడమే అధికారుల లక్ష్యమని బదిలీపై వెళ్తున్న జిపి కార్యదర్శి భూమేష్ అన్నారు తనను అభిమానించినందుకు గ్రామస్తులకు ప్రతి ఒక్కరిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను అన్నారు. ఈ కార్యక్రమంలో డీలర్ అరుణ్ పటేల్, గ్రామ పెద్దలు, యువకులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -