సర్పంచ్ బండి స్వామి, ఉప సర్పంచ్ బొబ్బిలి రాజు గౌడ్
నవతెలంగాణ-మల్హర్ రావు
ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 99 రోజుల ప్రజాపాలన ప్రగతి కార్యక్రమాన్ని పల్లెల్లో పక్కాగా అమలు చేయాలనే నేపథ్యంలో మండల కేంద్రమైన తాడిచెర్లలో గ్రామ సర్పంచ్ బండి స్వామి ఆధ్వర్యంలో గత రెండు రోజులుగా పారిశుధ్యం పనులు ముమ్మరంగా కొనసాగుతున్నాయి.గ్రామంలోని పలు వార్డుల్లోని డ్రైనేజీల్లో చెత్త,చెదారం జీపీ సిబ్బందితో తొలగించి,అంతర్గరోడ్లను శుభ్రం చేశారు.పెంజేరువు పెద్దమ్మతల్లి గుడి నుంచి ఎర్రమట్టి బొందల వరకు రోడ్డుకు ఇరువైపులా ఉన్న ముళ్ల పొదలు,పిచ్చి మొక్కలను జేసిబితో తొలగించారు.ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ బొబ్బిలి రాజు గౌడ్,వార్డు సభ్యులు తిర్రి అశోక్,ఇందారపు సారయ్య,ఏఎమ్మార్ ఉద్యోగులు బొబ్బిలి నరేశ్ గౌడ్,రాగం ఐలయ్య, జీపీ సిబ్బంది పాల్గొన్నారు.



