- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ ఇరాన్ అమెరికాకు షాక్ ఇచ్చినట్టు సమాచారం. సౌదీ అరేబియాలోని ప్రిన్స్ సుల్తాన్ ఎయిర్ బేస్ వద్ద నిలిపివున్న అమెరికా వైమానిక దళానికి చెందిన ఐదు ఇంధన ట్యాంకర్ విమానాలపై ఇరాన్ మిస్సైళ్లతో దాడి చేసినట్లు వార్తలు వచ్చాయి. ఈ ఘటనలో విమానాలు పాక్షికంగా దెబ్బతిన్నట్లు వెల్లడైంది. అయితే ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని వాల్ స్ట్రీట్ జనరల్ స్పష్టం చేసింది.
- Advertisement -



