Saturday, March 14, 2026
E-PAPER
Homeకరీంనగర్కాంగ్రెస్ కు బిగ్ షాక్.?

కాంగ్రెస్ కు బిగ్ షాక్.?

- Advertisement -

మాజీ మంత్రి జీవన్ రెడ్డి బీఆర్ఎస్ చేరికకు ముహూర్తం ఫిక్స్ !
ఇరకాటంలో ఎమ్మెల్యే సంజయ్ కుమార్ 
నవతెలంగాణ – జగిత్యాల టౌన్ 

కాంగ్రెస్ సీనియర్ నేత జీవన్ రెడ్డి పార్టీ వీడేందుకు సిద్దమయ్యారు. బీఆర్ఎస్ లో చేరెందుకు మూహుర్తం ఫిక్స్ చేసుకున్నట్లు, మున్సిపల్ ఎన్నికలకు ముందే బీఆర్ఎస్ తో టచ్ లో కి వెళ్లారని జిల్లాలో జోరుగా ప్రచారం జరుగుతోంది.  గతంలో ఎంపీ అరవింద్ కూడా జీవన్ రెడ్డి బిజెపిలోకి వస్తానంటే తానే స్వయంగా ఆయన ఇంటికి వెళ్లి ఆహ్వానిస్తానని తెలిపారు. 

రాష్ట్రంలో అధికార కాంగ్రెస్ పార్టీ కి బిగ్ షాక్ తగిలే సూచనలు కనిపిస్తున్నాయి. మాజీమంత్రి జీవన్ రెడ్డి కాంగ్రెస్ కు గుడ్ బై చెప్పి బీఆర్ఎస్ లో చేరేందుకు ముహూర్తం ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది. ఈనెల ఆఖరు లోపు ఆయన గులాబీ తీర్థం పుచ్చుకోబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. గత కొంత కాలంగా కాంగ్రెస్ పార్టీలోని పరిణామాల పట్ల తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్న జీవన్ రెడ్డి ఇక కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసే యోచనలో ఉన్నట్లు నియోజకవర్గ నేతలు చర్చించుకుంటున్నారు. 

ఈమేరకు ఇటీవల బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జీవన్ రెడ్డి భేటీ అయి పార్టీ లో చేరిక అంశంపై చర్చలు జరిపినట్లు జిల్లా వ్యాప్తంగా గుప్పుమంది. తన పార్టీ మార్పుపై తన సన్నిహితులతో చర్చించిన జీవన్ రెడ్డి కాంగ్రెస్ ను వీడి కారెక్కబోతున్నట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది.

సొంత పార్టీలో ఇమడలేక..
1985 నుంచి కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్యేగా, మంత్రిగా, ఎమ్మెల్సీగా వివిధ హోదాల్లో పని చేశారు. 2023 ఎన్నికల్లో జగిత్యాల నుంచి బరిలో నిలిచిన జీవన్ రెడ్డి బీఆర్ఎస్ అభ్యర్థి సంజయ్ చేతిలో ఓటమి పాలయ్యారు. అనంతరం ఎమ్మెల్యే సంజయ్ కాంగ్రెస్ పార్టీలో చేరడం, ఆయన రాకను జీవన్ రెడ్డి బహిరంగంగానే వ్యతిరేకిస్తున్నారు. ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికల సందర్భంగా జగిత్యాల కాంగ్రెస్ లో ఎమ్మెల్యే సంజయ్ వర్గానికి ఎక్కువ స్థానాలు ఇచ్చి తన వర్గానికి తక్కువ స్థానాలు ఇచ్చారనే కోపంతో జీవన్ రెడ్డి తన అనుచరులను స్వతంత్ర అభ్యర్థులుగా బరిలోకి దింపారు.

ఈ క్రమంలో ఎమ్మెల్యేకు జీవన్ రెడ్డికి మధ్య ఏర్పడిన విభేదాలను తగ్గించేందుకు పలు సందర్భాల్లో మంత్రుల కమిటీ రంగంలోకి దిగినా ఇష్యూ పరిష్కారం కావడంలేదు. మున్సిపల్ ఎన్నికల్లో తన వర్గానికే జగిత్యాల మున్సిపల్ చైర్ పర్సన్ పదవి దక్కుతుందని జీవన్ రెడ్డి ఆశించారు. కానీ చివరకు సంజయ్ వర్గానికి చెందిన వ్యక్తి చైర్మన్ గా ఎన్నిక కావడంతో జీవన్ రెడ్డి అసహానానికి గురైనట్లు సమాచారం.

ఈక్రమంలో ఇక తాను కాగ్రెస్ పార్టీలో కొనసాగడంపై ఆలోచిస్తున్నట్లు జీవన్ రెడ్డి ఇటీవల చెప్పారు. భవిష్యత్ ఏంటో గోచరించడం లేదని, అవమానాలు ఇంకెంతకాలం భరించాలని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో ఇక తన రాజకీయ భవిష్యత్ పై ఓ నిర్ణయానికి వచ్చిన జీవన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీని వీడేందుకే నిర్ణయించుకున్నారనే ప్రచారం జరుగుతోంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -