Sunday, March 15, 2026
E-PAPER
Homeతాజా వార్తలుబైక్‌ పొగ పీల్చి నలుగురి మృతి..

బైక్‌ పొగ పీల్చి నలుగురి మృతి..

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్ : అన్నమయ్య జిల్లా పుంగనూరులో విషాదం చోటుచేసుకుంది. బైక్ ఇంజిన్ ఆన్‌లో ఉంచి, దాని పొగ పీల్చి ఊపిరాడక తాత, మనవడు, ఇద్దరు మనవరాళ్లతో కలిపి మొత్తం నలుగురు మృతి చెందారు. రాత్రంతా బైక్‌ ఇంజిన్ ఆన్‌లో ఉంచి, అదే గదిలో నిద్రపోవడం వల్ల ఈ ఘోరం జరిగింది.
బైక్ ఇంజిన్‌ సమస్య ఉండటంతో బోర్ చేపించారు. రాత్రంతా ద్విచక్ర వాహనం స్టార్టింగ్‌లో ఉంచాలని మెకానిక్‌ చెప్పడంతో ఇంట్లో తలుపులు వేసి ఇంజిన్‌ను ఆన్‌ చేశాడు.
ఇల్లు ఇరుకుగా ఉండటం.. మరోవైపు గాలి బయటకు వెళ్లే వీలు లేకపోవడంతో రాత్రంతా బైక్‌ నుంచి వెలువడిన పొగ గదిలో వ్యాపించింది. దీంతో తాత, మనవడు, మనవరాళ్లు ఆ పొగ పీల్చి మృతిచెందారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -