- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్ : విశాఖలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. BHPV జంక్షన్ వద్ద ఆగి ఉన్న వాహనాలపైకి లారీ దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. ఓ కారు, రెండు టూవీలర్లు పూర్తిగా ధ్వంసమయ్యాయి. కూతురుతో కలిసి సింహాచలం గుడికి వెళ్తున్న రామకృష్ణ ఈ ప్రమాదంలో మృతి చెందగా, మరో మృతుడు సతీష్‌గా పోలీసులు గుర్తించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
- Advertisement -



