నవతెలంగాణ – హైదరాబాద్ : ఖర్గ్ ద్వీపంలోని చమురు ఎగుమతి కేంద్రంపై మరిన్ని దాడులు చేస్తామని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ హెచ్చరించారు. హర్ముజ్ జలసంధి రక్షణ కోసం యుద్ధనౌకలను పంపాలని మిత్రదేశాలను కోరారు. అమెరికా దాడులతో ఖర్గ్ ద్వీపంలోని చాలా భాగం ధ్వంసమైందని, మరిన్ని దాడులు జరగవచ్చని అన్నారు. శనివారం ఆయన జాతీయ మీడియాతో మాట్లాడారు. ఖర్గ్ ద్వీపంపై మరిన్ని దాడులు జరగొచ్చని ట్రంప్ అన్నారు. ఇప్పటికే తమ దళాలు జరిపిన దాడుల్లో అక్కడ చాలా భాగం ధ్వంసమైందన్నారు. కానీ, సరదాగా తాము మరికొన్ని సార్లు దాన్ని లక్ష్యంగా చేసుకుంటామని బెదిరింపు వ్యాఖ్యలు చేశారు. యుద్ధం ముగింపునకు సంబంధించి ఒక ఒప్పందం కోసం చర్చలకు ఇరాన్ సిద్ధంగా ఉందని ట్రంప్ తెలిపారు. అయితే, అందుకు ప్రతిపాదించిన షరతులు సరిపోవని అన్నారు. యుద్ధాన్ని ముగించే లక్ష్యంతో చర్చలు ప్రారంభించేందుకు మధ్యప్రాచ్య మిత్రదేశాలు చేసిన ప్రయత్నాలను ట్రంప్ యంత్రాంగం తిరస్కరించిందని సంబంధిత వర్గాలు మీడియాకు తెలిపాయి.
ఖర్గ్ ద్వీపం మరిన్ని దాడులు చేస్తాం: ట్రంప్
- Advertisement -
- Advertisement -



