నవతెలంగాణ – హైదరాబాద్: దేశంలో నాలుగు రాష్ట్రాలతోపాటు ఓ కేంద్ర పాలిత ప్రాంతంలో అసెంబ్లీ ఎన్నికలకు నగారా మోగింది. తమిళనాడు (234), పశ్చిమ బెంగాల్ (294), కేరళ (140), అస్సాం (126)తోపాటు పుదుచ్చేరి (30) రాష్ట్రాల్లో మొత్తంగా 824 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ వివరాలను వెల్లడించింది. దీంతో ఆయా రాష్ట్రాల్లో ఎన్నికల కోడ్ తక్షణమే అమల్లోకి వచ్చింది. ఈ ఐదు ప్రాంతాల్లో మొత్తం 17.4 కోట్ల మంది ఓటర్లు ఉన్నారని, 2.18 లక్షల పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. పోలింగ్ కేంద్రాల్లో దివ్యాంగులు, వృద్ధుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నామని, యువత పెద్ద ఎత్తున ఓటు హక్కు వినియోగించుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. మే 4న జరిగే కౌంటింగ్‌తో అభ్యర్థుల భవితవ్యం తేలనుంది.
పోలింగ్ తేదీలు
1. పశ్చిమ బెంగాల్ (మొత్తం స్థానాలు: 294) రాష్ట్రంలో రెండు దశల్లో ఎన్నికలు జరగనున్నాయి.
తొలి దశ: (152 స్థానాలకు ఎన్నికలు)
నోటిఫికేషన్: మార్చి 30
నామినేషన్ల చివరి తేదీ: ఏప్రిల్ 6
నామినేషన్ల పరిశీలన: ఏప్రిల్ 7
ఉపసంహరణ చివరి తేదీ: ఏప్రిల్ 9
పోలింగ్: ఏప్రిల్ 23
ఓట్ల లెక్కింపు మే 4
రెండో దశ: (142 స్థానాలకు ఎన్నికలు)
నోటిఫికేషన్: ఏప్రిల్ 2
నామినేషన్ల చివరి తేదీ: ఏప్రిల్ 9
నామినేషన్ల పరిశీలన: ఏప్రిల్ 10
ఉపసంహరణ చివరి తేదీ: ఏప్రిల్ 13
పోలింగ్: ఏప్రిల్ 29
ఓట్ల లెక్కింపు మే 4
2. తమిళనాడు (మొత్తం స్థానాలు: 234)
ఒకే విడతలో ఎన్నికలు జరగనున్నాయి.
నోటిఫికేషన్: మార్చి 30
నామినేషన్ల చివరి తేదీ: ఏప్రిల్ 6
నామినేషన్ల పరిశీలన: ఏప్రిల్ 7 ఉ
పసంహరణ చివరి తేదీ: ఏప్రిల్ 9
పోలింగ్: ఏప్రిల్ 23
ఓట్ల లెక్కింపు మే 4
3. కేరళ (మొత్తం స్థానాలు: 140)
ఒకే విడతలో ఎన్నికలు జరగనున్నాయి.
నోటిఫికేషన్: మార్చి 16
నామినేషన్ల చివరి తేదీ: మార్చి 23
నామినేషన్ల పరిశీలన: మార్చి 24
ఉపసంహరణ చివరి తేదీ: మార్చి 26
పోలింగ్: ఏప్రిల్ 9
ఓట్ల లెక్కింపు మే 4
4. అసోం (మొత్తం స్థానాలు: 126)
ఒకే విడతలో ఎన్నికలు జరగనున్నాయి.
నోటిఫికేషన్: మార్చి 16
నామినేషన్ల చివరి తేదీ: మార్చి 23
నామినేషన్ల పరిశీలన: మార్చి 24
ఉపసంహరణ చివరి తేదీ: మార్చి 26
పోలింగ్: ఏప్రిల్ 9
ఓట్ల లెక్కింపు మే 4
5. పుదుచ్చేరి (మొత్తం స్థానాలు: 30)
ఒకే విడతలో ఎన్నికలు జరగనున్నాయి.
నోటిఫికేషన్: మార్చి 16
నామినేషన్ల చివరి తేదీ: మార్చి 23
నామినేషన్ల పరిశీలన: మార్చి 24
ఉపసంహరణ చివరి తేదీ: మార్చి 26
పోలింగ్: ఏప్రిల్ 9
ఓట్ల లెక్కింపు మే 4



