Monday, March 16, 2026
E-PAPER
Homeతాజా వార్తలునేను పార్టీ మారడం లేదు: మల్లారెడ్డి

నేను పార్టీ మారడం లేదు: మల్లారెడ్డి

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్ : మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే మల్లారెడ్డి తాను కాంగ్రెస్‌లో చేరనున్నారనే వార్తలను ఖండించారు. అసెంబ్లీ వద్ద మీడియాతో మాట్లాడుతూ.. తన వయసు 73 ఏండ్లని, ఏ నిర్ణయం తీసుకోవాలో తనకు తెలుసని, కాంగ్రెస్ పార్టీ మునిగిపోయే నావ లాంటిదని ఎద్దేవా చేశారు. రేవంత్ రెడ్డి 50 ఏండ్లు కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటుందన్నా, అది మునిగిపోయే పడవనే అని వ్యాఖ్యానించారు. క్షేత్రస్థాయిలో ఎవరు బలంగా ఉన్నారో అందరికీ తెలుసని, ఇటీవల సీఎం రేవంత్ రెడ్డిని కలిసి పెళ్ళిరోజు వేడుకలకు ఆహ్వానించినట్లు తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -