Monday, March 16, 2026
E-PAPER
Homeజాతీయంపొట్టి శ్రీరాములు విగ్రహాన్ని ఆవిష్కరించిన సీఎం చంద్రబాబు

పొట్టి శ్రీరాములు విగ్రహాన్ని ఆవిష్కరించిన సీఎం చంద్రబాబు

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్: ఏపీ రాజధాని అమరావతిలో తెలుగు జాతి ఆత్మగౌరవానికి, ప్రాణత్యాగానికి నిలువుటద్దంగా నిలిచిన అమరజీవి పొట్టి శ్రీరాముల 125వ జయంతి సందర్భంగా తుళ్లూరు సమీపంలోని శాఖమూరు పార్కు సమీపంలో 58 అడుగుల భారీ కాంస్య విగ్రహాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆవిష్కరించారు. ఆంధ్ర రాష్ట్ర సాధన కోసం ఆయన చేసిన 58 రోజుల ఆమరణ దీక్షకు గుర్తుగా ఈ విగ్రహాన్ని సరిగ్గా 58 అడుగుల ఎత్తులో రూపొందించడం జరిగింది. ఈ వేడుకలో కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, రాష్ట్ర మంత్రులు లోకేశ్, నాదెండ్ల మనోహర్, కందుల దుర్గేశ్, టీజీ భరత్, ఏపీ బీజేపీ అధ్యక్షుడు మాధవ్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -