Monday, March 16, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్అగ్ని ప్రమాదాలపై విద్యార్థులకు అవగాహన

అగ్ని ప్రమాదాలపై విద్యార్థులకు అవగాహన

- Advertisement -

నవతెలంగాణ – ఆలేరు రూరల్
ఆలేరు మండలం కొలనుపాక పీఎం శ్రీ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో సోమవారం అగ్నిమాపక శాఖ ఆధ్వర్యంలో విద్యార్థులకు అగ్ని ప్రమాదాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా అగ్ని ప్రమాదాలు ఎలా జరుగుతాయి, వాటిని ఎలా నివారించాలి,ప్రమాదం సంభవించినప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అధికారులు ప్రదర్శనల ద్వారా వివరించారు. అగ్నిమాపక సిబ్బంది ఫైర్ అగ్ని ప్రమాదం సంభవించినప్పుడు భయపడకుండా సమయోచితంగా స్పందించాలని విద్యార్థులకు సూచించారు. అలాగే విద్యార్థులు ఇంట్లోనూ పాఠశాలలోనూ విద్యుత్ పరికరాలను జాగ్రత్తగా ఉపయోగించాలన్నారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు ఆకుల వేణుగోపాల్, స్టేషన్ ఫైర్ ఆఫీసర్ అబ్దుల్ హమీద్, అగ్నిమాపక సిబ్బంది మల్లికార్జున్, హరీష్ రెడ్డి, కరుణాకర్, శ్రీనివాస్, ఉపాధ్యాయులు మరియు విద్యార్థులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -