Tuesday, March 17, 2026
E-PAPER
Homeక్రైమ్కండ్లల్లో కారం కొట్టి రూ.కోటి కాజేసిన దుండగులు

కండ్లల్లో కారం కొట్టి రూ.కోటి కాజేసిన దుండగులు

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్ : హైదరాబాద్‌ కూకట్‌పల్లి పీఎస్ పరిధిలో సినీ ఫక్కీలో భారీ చోరి జరిగింది. బాధితుల కండ్లల్లో కారం కొట్టి ఏకంగా రూ.కోటి నగదును దోచుకెళ్లారు. పోలీసుల సమాచారం ప్రకారం.. అజాముద్దీన్, కుస్రుఫ్ అనే ఇద్దరు వ్యక్తులు సుమారు రూ.కోటి నగదు బహదూర్‌పూర నుంచి జీడిమెట్లకు బైక్‌పై వెళ్తున్నారు. వీరు కూకట్‌పల్లి ఏసీపీ కార్యాలయ సమీపానికి చేరుకోగానే, దుండగులు అడ్డుకుని వారి కళ్లలో కారం కొట్టి నగదును తీసుకుని పరారయ్యారు. బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ నగదు హవాలా డబ్బుగా పోలీసులు అనుమానిస్తున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -