- Advertisement -
నవతెలంగాణ బెంగళూరు: గ్యాస్ సిలిండర్ల కొరత నేపథ్యంలో కర్ణాటకలోని ఓ హోటల్లో బిల్లుల్లో గ్యాస్ క్రైసిస్ ఛార్జ్ అంటూ అదనంగా 5 శాతం బాదడం, అదీ నిమ్మసానికి కావడం సామాజిక మాధ్యమాల్లో తీవ్ర ఆక్షేపణకు గురైంది. ఆదివారం బెంగళూరులోని ఓ కేఫ్‌కు వెళ్లి నిమ్మరసం తాగిన వినియోగదారులు, బిల్లు చూసి అవాక్కయ్యారు. రెండు జ్యూస్‌ల ధర రూ.358. దీనికి తోడు గ్యాస్ క్రైసిస్ ఛార్జ్ పేరిట ఏకంగా 5 శాతం (రూ.17.01) బాదారు. నిమ్మకాయ జ్యూస్‌కు గ్యాస్ ఛార్జ్ అని బిల్లు వేయటమేంటని జనం మండిపడుతున్నారు. దీంతో ఈ హోటల్‌కు రాష్ట్ర ఆహార, పౌరసరఫరాలు, వినియోగదారుల హక్కుల కమిషన్ తాఖీదులు జారీ చేసింది.
- Advertisement -



