Tuesday, March 17, 2026
E-PAPER
Homeకరీంనగర్బీఆర్ఎస్ ప్రభుత్వంలో ముస్లిం మైనార్టీలకు పెద్దపీట 

బీఆర్ఎస్ ప్రభుత్వంలో ముస్లిం మైనార్టీలకు పెద్దపీట 

- Advertisement -

-మత సామరస్యానికి ప్రతీక రంజాన్‌ మాసం..
– ప్రతి పండుగను అధికారికంగా జరిపిన కేసీఆర్‌
– ఉపవాస దీక్షలతోనైనా ప్రభుత్వంలో మార్పు రావాలే
– ఇప్తార్‌ విందులో మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధూకర్‌
నవతెలంగాణ-రామగిరి 

మత సామరస్యానికి ప్రతీకగా రంజాన్‌ మాసం నిలుస్తుందని, రంజాన్‌ పండుగ వస్తే వరుసలతో పిలుచుకునే సంస్కృతి ఉందని, మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధూకర్‌ అన్నారు. రంజాన్‌ పండుగను పురస్కరించుకుని రామగిరి మండలం సెంటనరీ కాలనీలోని జామ మజీద్‌ లో  బీఆర్ఎస్‌ పార్టీ నాయకులు ఎండీ జాఫర్‌ ఏర్పాటు చేసిన ఇఫ్తార్‌ విందులో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్బంగా ముస్లింలతో కలిసి ప్రత్యేక ప్రార్థనలు చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, కుల మతాలకు అతీతంగా ఇక్కడ జీవిస్తామని గొప్పగా ఆలోచన చేసిన కేసీఆర్‌ హిందు, ముస్లిం, క్రిస్టియన్‌ పండుగలను అధికారికంగా నిర్వహించి గొప్ప సందేశం ఇచ్చారని ఆయన గుర్తు చేశారు.

ప్రతి పండుగకు కానుకలు అందజేసి పండుగలను ఘనంగా నిర్వహించారన్నారు. అయితే ఒక్క క్షణం మన ఆలోచన మారిపోవడం వల్ల అనేక అనర్థాలు చూస్తున్నామని, తెలంగాణ రాష్ట్రం గొప్పగా ఉండాలంటే పండుగలను గొప్పగా జరుపుకోవాలంటే ప్రభుత్వ సహాకారం అవసరమని ఈ ప్రభుత్వం గుర్తించాలన్నారు.ఆనాడు తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే మతకలహాలు వస్తాయని, హైదరబాద్‌ అల్లకల్లోలం అవుతుందని, నక్సలిజం పెరుగుతుందని తెలంగాణాను అడ్డుకున్నారని, కానీ అడ్డుకునోళ్లే నివ్వేరపోయేలా పదేళ్లపాటు కేసీఆర్‌ గొప్పగా పాలన అందించారని ఆయన అన్నారు. కేసీఆర్‌ ఆలోచన, ఆయన పాలన ఏ విధంగా ఉండేదో ప్రతి ఒక్కరికి ఈనాడు అర్థం అయిందన్నారు.

రంజాన్‌ పండుగ సందర్బంగా ఇఫ్తార్‌ విందులో పాల్గొనడం సంతోషంగా ఉందని, ముస్లిం సోదరీసోదరులకు రంజాన్‌ శుభాకాంక్షలను ఈ సందర్బంగా ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో రామగిరి మండల బిఆర్ఎస్ అధ్యక్షులు శెంకేషి రవీందర్, ఏఎంసీ మాజీ చైర్మన్ పూదరి సత్యనారాయణ గౌడ్, రైతుబంధు నాయకులు మేదరవేనా కుమార్ యాదవ్, నాగేల్లి సాంబయ్య, కాపురవేన భాస్కర్, అల్లం తిరుపతి, దామెర శ్రీనివాస్, బొంకూరి పోశం,  బూరుగు రాజు గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -