Tuesday, March 17, 2026
E-PAPER
Homeజాతీయంక్రాస్‌ ఓటింగ్‌..ముగ్గురు ఎమ్మెల్యే సస్పెండ్‌

క్రాస్‌ ఓటింగ్‌..ముగ్గురు ఎమ్మెల్యే సస్పెండ్‌

- Advertisement -

న‌వతెలంగాణ‌-హైద‌రాబాద్‌: రాజ్యసభ ఎన్నికల్లో క్రాస్‌ ఓటింగ్‌కు పాల్పడిన ముగ్గురు ఒడిశా ఎమ్మెల్యేలను కాంగ్రెస్‌ మంగళవారం సస్పెండ్‌ చేసింది. రమేష్‌ జెనా, దాశరథి గమాంగో, సోఫియా ఫిర్దౌస్‌లను పార్టీ నుండి సస్పెండ్‌ చేసినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. ”రాజ్యసభ ఎన్నికల్లో కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు రమేష్‌ జెనా, దాశరథి గమాంగో, సోఫియా ఫిర్దౌస్‌లు బిజెపి అభ్యర్థికి అనుకూలంగా క్రాస్‌ ఓటింగ్‌కి పాల్పడ్డారు. వారినుండి ఈ చర్యను ఊహించలేదు. రాజ్యాంగంలోని పదవ షెడ్యూల్‌ నిబంధనల ప్రకారం వారిని బహిష్కరిస్తున్నాము” అని ఒడిశా ప్రదేశ్‌ కాంగ్రెస్‌ కమిటీ అధ్యక్షుడు భక్త చరణ్‌ దాస్‌ మీడియాకు తెలిపారు.
మొత్తం నాలుగు రాజ్యసభ స్థానాలకు గాను మూడు స్థానాలను ఎన్‌డిఎ కూటమి, ఒక స్థానాన్ని బిజెడి గెలుచుకున్నాయి. దీంతో కాంగ్రెస్‌ ఓటమి పాలైంది. కాంగ్రెస్‌, బిజెడి, వామపక్షాల ఉమ్మడి అభ్యర్థిగా బరిలోకి దిగిన దత్తేశ్వర్‌ రారు హోటా, బిజెపి మద్దతునిచ్చిన స్వతంత్య్ర అభ్యర్థి దిలీప్‌ రారు చేతిలో ఓటమి పాలయ్యారు. రెండు పార్టీలు జారీ చేసిన విప్‌కు వ్యతిరేకంగా బిజెడి, కాంగ్రెస్‌లకు చెందిన 11మంది ఎమ్మెల్యేలు దిలీప్‌ రారుకు ఓటు వేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -