నవతెలంగాణ-హైదరాబాద్: పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో 294 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి.రెండు(ఏప్రిల్ 23, 29 తేదీల్లో) దశల్లో పోలింగ్ జరగనుంది. మే 4న ఫలితాలు వెలువడనున్నాయి. ఈక్రమంలో అధికార పార్టీ తృణముల్ కాంగ్రెస్(TMC ) 291 స్థానాలకు ఆ పార్టీ అభ్యర్థులను ఖరారు చేసింది. ఈ మేరకు ఆయా నియోజకవర్గాల్లో పోటీ చేయనున్న అభ్యర్థుల పేర్లను మంగళవారం టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ వెల్లడించారు. టీఎంసీ మిత్రపక్షమైన భారతీయ గూర్ఖా ప్రజాతాంత్రిక్ మోర్చా (BGPM)కి మూడు సీట్లు కేటాయించారు. BGPM పార్టీ అభ్యర్థులు డార్జిలింగ్, కుర్సియోంగ్, కాలింపాంగ్ అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి పోటీ చేయనున్నారు. తాజా జాబితా ప్రకారం..సీఎం మమతా బెనర్జీ భబానీపూర్ నుండి ప్రతిపక్ష నాయకుడు సువేందు అధికారి(బీజేపీ)పై పోటీ చేయనున్నారు.
టీఎంసీ తొలి జాబితా విడుదల
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



