నవతెలంగాణ-హైదరాబాద్ : దేశీయంగా అత్యంత విశ్వసనీయ ప్రైవేట్ జీవిత బీమా దిగ్గజాల్లో ఒకటైన ఎస్‌బీఐ లైఫ్ ఇన్సూరెన్స్ తెలంగాణలో తన కార్యకలాపాలను మరింత విస్తరించింది. హైదరాబాద్‌లో మరో కొత్త శాఖను ప్రారంభించింది. రాష్ట్రవ్యాప్తంగా వ్యక్తులు, కుటుంబాల అవసరాలకు అనుగుణంగా బీమా లభ్యతను పెంచడంపై, ఆర్థిక సొల్యూషన్స్‌ని అందించడంపై సంస్థకు గల నిబద్ధతకు ఈ విస్తరణ నిదర్శనంగా నిలుస్తుంది.
కొత్తగా ప్రారంభించిన ఈ శాఖ చిరునామా: 3వ అంతస్తు, ‘శ్రేష్ఠ మ్యాగ్నస్’, Sr. No.23, D.No. 7-3-1, బైరామల్‌గూడ, సాగర్ రోడ్ జంక్షన్, హైదరాబాద్, తెలంగాణ – 500074 గా ఉంటుంది. ఎస్‌బీఐ లైఫ్ జోనల్ డైరెక్టర్ Mr. రాజీవ్ శ్రీవాస్తవ, తెలంగాణ రీజినల్ డైరెక్టర్ Mr. అభిషేక్ కర్ మజుందార్ తదితర ప్రముఖుల సమక్షంలో ఎస్‌బీఐ లైఫ్ ఆపరేషన్స్ & ఐటీ విభాగం ప్రెసిడెంట్ జి. దుర్గాదాస్ ఈ శాఖను ప్రారంభించారు.
ఈ కొత్త శాఖతో కలిపి తెలంగాణ రాష్ట్రంలో ఎస్‌బీఐ లైఫ్ శాఖల సంఖ్య మొత్తం 59కి చేరినట్లవుతుంది. దీనితో ఈ ప్రాంతంలో సంస్థ పంపిణీ నెట్‌వర్క్, మరియు కార్యకలాపాలు మరింత పటిష్టమవుతాయి. కొత్త శాఖలో పాలసీ జారీ, ప్రీమియం చెల్లింపుల స్వీకరణ, పాలసీ సేవలు, క్లెయిమ్ సహాయం వంటి సేవలను సమగ్రంగా అందిస్తారు. కస్టమర్ల సౌలభ్యం కోసం ప్రతి దశలో అవసరమైన సేవలు అందించడమే లక్ష్యంగా ఈ శాఖ పని చేస్తుంది.
ప్రాంతీయంగా బీమా లభ్యతను పెంపొందించడంతో పాటు పటిష్టమైన డిజిటల్ సామర్థ్యాలు, సర్వీస్ వ్యవస్థ దన్నుతో ఎస్‌బీఐ లైఫ్ రక్షణ, సేవింగ్స్, సంపద సృష్టి, రిటైర్మెంట్ తదితర అవసరాల కోసం పలు బీమా సొల్యూషన్స్‌ని అందిస్తోంది. కొత్తగా ప్రారంభించిన శాఖల్లో పాలసీ జారీ మరియు సర్వీసింగ్, ప్రీమియం రెన్యువల్స్, క్లెయిమ్‌లకు సంబంధించిన సహాయం వంటి పూర్తి స్థాయి సేవలు అందుబాటులో ఉంటాయి. తద్వారా కస్టమర్లకు ప్రతి దశలో సమయానుకూల మార్గదర్శకత్వం, విశ్వసనీయ సేవలు అందించడమే లక్ష్యంగా సంస్థ పనిచేస్తోంది.



