Tuesday, March 17, 2026
E-PAPER
Homeజాతీయంనయనతారపై ఎంపీ సీవీ షణ్ముగం అనుచిత వ్యాఖ్యలు..

నయనతారపై ఎంపీ సీవీ షణ్ముగం అనుచిత వ్యాఖ్యలు..

- Advertisement -

న‌వతెలంగాణ‌-హైద‌రాబాద్‌: ప్రముఖ నటి నయనతారపై అనుచిత వ్యాఖ్యలు చేసిన తమిళనాడు ఎంపీ సీవీ షణ్ముగం వివాదంలో చిక్కుకున్నారు. మంగళవారం ఎన్డీయే కూటమి నిర్వహించిన నిరసన కార్యక్రమంలో..’కలలు కనమని అబ్దుల్ కలాం మనకు చెప్పారు. మన కలలను తనతో పంచుకోవాలని స్టాలిన్ అడుగుతున్నారు. నాకు నయనతార కావాలని అడిగితే.. ఆయన నెరవేరుస్తారా? ఆమెను పెళ్లి చేసుకోవాలనే కల ఎవరికైనా ఉంటే తీరుస్తారా’ అని వ్యాఖ్యానించారు. ఆయన వ్యాఖ్యలపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి .

ఇటీవల తమిళనాడు సీఎం స్టాలిన్ మాట్లాడుతూ.. ‘మీ కలలను మాకు చెప్పండి. వాటిని నెరవేర్చడానికి మా ప్రభుత్వం కృషి చేస్తుంది’ అని ప్రజలకు హామీ ఇచ్చారు.అయితే సీఎం హామీకి వ్యంగ్యంగా కౌంటర్ ఇచ్చేందుకు ప్రయత్నించిన షణ్ముగం అనవసరంగా నయనతార ప్రస్తావన తీసుకొచ్చారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -