Friday, August 29, 2025
E-PAPER
spot_img
Homeప్రధాన వార్తలుస్థానికంకు సన్నద్ధం

స్థానికంకు సన్నద్ధం

- Advertisement -

– రాష్ట్రంలో ఈసీఐ బృందం పర్యటన
– తెలంగాణ సీఈఓతో భేటీ
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో

స్థానిక సంస్థలు, పురపాలక సంఘాల ఎన్నికల నిర్వహణకు రంగం సిద్ధమవుతోంది. ఈ ఏర్పాట్లను పర్యవేక్షించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీఐ) ప్రతినిధుల బృందం రాష్ట్రంలో పర్యటిస్తున్నది. ఈసీఐ ముఖ్య కార్యదర్శి మహ్మద్‌ ఉమర్‌, కార్యదర్శి నవీన్‌కుమార్‌, సెక్షన్‌ ఆఫీసర్‌ రవీందర్‌కుమార్‌ తదితరులు ఈ బృందంలో ఉన్నారు. జూన్‌ 1వ తేదీ వరకు వీరు రాష్ట్రంలో పర్యటిస్తారు. దానిలో భాగంగా శుక్రవారం తెలంగాణ రాష్ట్ర చీఫ్‌ ఎలక్ట్రోరల్‌ ఆఫీసర్‌ సీ సుదర్శన్‌రెడ్డితో ఈ బృందం సభ్యులు భేటీ అయ్యారు. గ్రామ పంచాయతీ, ఎమ్‌పీటీసీ, జెడ్‌పీటీసీ, పురపాలక సంఘాల ఎన్నికల నిర్వహణకు సంబంధించిన పలు అంశాలపై వారు చర్చించారు. ఓటర్ల జాబితా తయారీ, ఎలక్ట్రానిక్‌ ఓటింగ్‌ యంత్రాలు (ఈవీఎమ్‌)తో పాటు ఇతర లాజిస్టిక్స్‌ ఏర్పాట్లను సమీక్షించారు. ఎన్నికలను స్వేచ్ఛగా, స్వతంత్రంగా జరిగేలా ఏర్పాట్లు ఉండాలని చెప్పారు. ఎన్నికల నిర్వహణకు సంబంధించి అవసరమైన అన్ని సౌకర్యాలు కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉన్నదని ఈ సందర్భంగా సీఈఓ సీ సుదర్శన్‌రెడ్డి తెలిపారు. కేంద్ర బృందం నాలుగు రోజుల క్షేత్రస్థాయి పర్యటనల్లో భాగంగా శనివారం పలు జిల్లాల ఎన్నికల ప్రధానాధికారులతో భేటీ కానున్నారు. ఆయా ఏర్పాట్లను పరిశీలించి, పూర్తిస్థాయి నివేదికను ఈసీఐకి అందచేస్తామని బృందం ప్రతినిధులు తెలిపారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad