Wednesday, March 18, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్యువత స్వయంకృషితో అంచలంచెలుగా ఎదగాలి..

యువత స్వయంకృషితో అంచలంచెలుగా ఎదగాలి..

- Advertisement -

– రాంరెడ్డిపల్లి ఓర్సు అలివేలఆంజనేయులు..
నవతెలంగాణ – ఊరుకొండ 

నిరుద్యోగ యువతీ యువకులు ప్రతి ఒక్కరూ తమకు అనుకూలంగా ఉన్నటువంటి వనరులను ఉపయోగించుకొని.. ప్రభుత్వ పథకాలను పూర్తిగా సద్వినియోగం చేసుకొని లాభాలు పొందుతూ స్వయంకృషితో భవిష్యత్తులో అంచలంచెలుగా ఎదగాలని రాంరెడ్డిపల్లి ఓర్సు అలివేలఆంజనేయులు అన్నారు. మంగళవారం ఊరుకొండ మండల పరిధిలోని రాంరెడ్డిపల్లి గ్రామంలో యువత స్వయం కృషితో ఎదగాలని గ్రామ సర్పంచ్ ఓర్స్ అలివేల ఆధ్వర్యంలో పిఎంఈజిపి మరియు రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీ ఎస్టీలకు కమర్షియల్ వెహికల్ కి మహిళల మీద 45% సబ్సిడీ, పురుషులకు 30% సబ్సిడీలు, ఇతర కులాలకు సంబంధించిన అంగవైకల్యం చెందిన వ్యక్తులకు 50% సబ్సిడీ సంబంధించిన వివరాలను గ్రామ యువకులకు గ్రామపంచాయతీలో జిల్లా పరిశ్రమలశాఖ మరియు బ్యాంకు వారి ఆధ్వర్యంలో  అవగాహన కల్పించారు.

ఈ అవకాశాన్ని రాంరెడ్డిపల్లి గ్రామ యువకులు పెద్ద సంఖ్యలో పాల్గొని అప్లికేషన్లు పెట్టుకోవడం అభినందనీయమని సర్పంచ్ అలివేల అన్నారు. యువత ఆలోచన విధానం మెరుగ్గా ఉండాలని, మంచి నడవడికగా భవిష్యత్తులో ఎదగాలని ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని రామిరెడ్డిపల్లి గ్రామపంచాయతీ యందు నిర్వహించడం జరిగిందని తెలిపారు. కార్యక్రమంలో జిల్లా పరిశ్రమలశాఖ అధికారి భాస్కర్ రెడ్డి, ఈడిసి మేనేజర్ బాలకృష్ణ నిఖిల్. డిపిఎం చెన్నై,  గ్రామ పెద్దలు జంగారెడ్డి, సుజీవన్ రెడ్డి, శ్రీనివాస్ యాదవ్, శివశంకర్, ఎంపీడీవో సత్యపాల్ రెడ్డి, ఎంపీవో లక్ష్మణ్ నాయక్, పంచాయతీ కార్యదర్శి కిరణ్, హరి, సీసీ పోశయ్య, వార్డు మెంబర్లు, యువకులు, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -