Wednesday, March 18, 2026
E-PAPER
Homeనిజామాబాద్భారత-కెనడా సంస్కృతుల సంఘర్షణపై అంతర్జాతీయ సెమినార్

భారత-కెనడా సంస్కృతుల సంఘర్షణపై అంతర్జాతీయ సెమినార్

- Advertisement -

నవతెలంగాణ-డిచ్‌పల్లి: తెలంగాణ యూనివర్సిటీ న్యాయ కళాశాలలో బుధవారం భారత – కెనడా సంస్కృతుల సంఘర్షణ పై ఆన్లైన్ విధానంలో అంతర్జాతీయ సెమినార్ నిర్వహించారు. ముఖ్య వక్తగా పాల్గొన్న శ్రీనివాస్ చక్రవర్తి మాట్లాడుతూ భారత కెనడా దేశాల మధ్య కుటుంబ సాంప్రదాయ మరియు వ్యక్తిగత అంశాలలో అనేక రకాల వ్యత్యాసాలు ఉన్నట్టు తెలిపారు. భారతీయులు కెనడాలో జీవనం సాగించడానికి వారి వ్యక్తిగత, కుటుంబ, సామాజిక అంశాలలో రాజీ పడవలసిన అవసరం ఏర్పడుతుందని లేనట్లయితే మనుగడ కష్టమని వివరించారు.

భారత సంప్రదాయాలు, వంటకాలు, పండుగలు, వ్యక్తిగత అవసరాలు, కోరికలు, ఆశలు కెనడా సమాజ సంప్రదాయాలు జీవన విధానాలతో ముడిపడలేక సంఘర్షణకు గురవుతున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో న్యాయ విభాగ అధ్యక్షురాలు డాక్టర్ ప్రసన్న రాణి చైర్పర్సన్ బోర్డ్ ఆఫ్ స్టడీస్ డాక్టర్ బి స్రవంతి, విభాగ సీనియర్ అధ్యాపకుడు డాక్టర్ జెట్లింగ్ ఎల్లోసా పాల్గొన్నారు. విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొని అంతర్జాతీయ సంబంధాల విషయాలను ఆసక్తితో తెలుసుకున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -