Wednesday, March 18, 2026
E-PAPER
Homeవరంగల్పల్లెల్లో బెల్ట్ షాప్ పండుగ... అధికారులకు మాత్రం విశ్రాంతి వేడుక!

పల్లెల్లో బెల్ట్ షాప్ పండుగ… అధికారులకు మాత్రం విశ్రాంతి వేడుక!

- Advertisement -

రెడ్డి సాబ్ అందని @4 కోట్లు నెలకు 
పేద,సద బ్రతుకులను బెల్ట్ షాప్ ల పేరుతో
దోచ్చుకుంటున్న దందా సాబ్..
నవతెలంగాణ – కాటారం

పచ్చని పల్లెల్లో పంటల సందడి మధ్య, ఇంకో “ప్రత్యేక పండుగ” కాటారం లో బెల్ట్ షాప్ దందా  మాత్రం బహిరంగంగానే జరుగుతోంది. అది పంట పండుగ కాదు, జాతర కాదు… “బెల్ట్ షాప్ పండుగ”! గ్రామీణ ప్రాంతాల్లో నిషేధితంగా ఉండాల్సిన ఈ వ్యాపారం, ఇక్కడ మాత్రం దర్జాగా సాగుతుండటం గమనార్హం. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం  లో ఇంత జరుగుతున్న ఎక్ససైజ్ అధికారులు అస్సలు కాటారం లో బెల్ట్ షాప్ లు లేవు అన్నడం విడ్డురంగా అన్పిస్తుంది.ఒకే దగ్గర ఒకటి వైన్ షాప్ ఒకటి బెల్ట్ షాప్ హోల్ సెల్ కు (బెల్ట్ షాప్) దందా నడుస్తుంది అని కాటారం ప్రజా లోకం కొడయ్ కొస్తుంది. స్థానికుల మాటల్లో, ఈ బెల్ట్ షాప్ వ్యాపారం చిన్నది కాదు. నెలకు కోట్ల రూపాయలు తిరుగుతున్నాయనే ప్రచారం ఊరంతా వినిపిస్తున్నా, ఎక్ససైజ్అ ధికారుల దృష్టికి మాత్రం ఇవి కనిపించనట్టే ఉంది. “పల్లెల్లో పంటల కంటే బెల్ట్ షాపులే ఎక్కువగా కనిపిస్తున్నాయి” అంటూ గ్రామస్తుల నుండి  బహిరంగగానే విమర్శలు వస్తున్నాయి. ఇంకా ఆశ్చర్యకరం ఏమిటంటే… ఈ వ్యవహారం గురించి ఎన్ని కథనాలు వచ్చినా, ఎలాంటి మార్పు కనిపించకపోవడం. “ఎవరైనా, ఎన్ని అయినా  రాసుకోండి… ఎవరూ ఏమీ చేయలేరు” అన్నట్టుగా ఈ వ్యాపారం కాటారం మండలం లో  రోజురోజుకూ మరింత విస్తరిస్తోందని స్థానికులు అంటున్నారు.కాటారం ఎక్ససైజ్ శాఖ విషయానికి వస్తే, వారికి ఈ బెల్ట్ షాప్ పండుగ గురించి తెలియనట్టేం లేదు. అయితే చర్యల విషయంలో మాత్రం పూర్తి విశ్రాంతి తీసుకుంటున్నట్టే కనిపిస్తోంది. అని స్థానికులు వ్యాఖ్యానిస్తున్నారు.ఇక ఈ పరిస్థితులపై సంబంధిత అధికారులు ఎప్పుడు స్పందిస్తారు, పల్లెల్లో జరుగుతున్న ఈ ‘పండుగ’కు ఎప్పుడు చెక్ పడుతుందో వెచి  చూడాలి మరి .

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -