ఆకట్టుకుంటున్న నంది నాటకాలు

Impressive Nandi dramasగుంటూరు : ఏపీరాష్ట్ర చలనచిత్ర టివి, నాటకరంగ అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో గుంటూరులో జరుగుతున్న నంది నాటకోత్సవాలు ఉత్సాహభరిత వాతావరణంలో జరిగాయి. రెండోరోజు ఆదివారం రెండు నాటకాలు, మూడు నాటికలు ప్రదర్శించారు. తొలిగా డాక్టర్‌ పి.వి.ఎన్‌.కష్ణ రచన దర్శకత్వంలో శ్రీ మాధవ వర్మ పద్య నాటకాన్ని, అనంతరం ‘బాధ్యత’ బాలల నాటిక ప్రదర్శన జరిగింది. పర్యావరణ పరిరక్షణ నేపథ్యంలో చిచ్చరపిడుగుల్లాంటి బాలలు తమ నటనా కౌశలాన్ని ప్రదర్శించి ప్రశంసలందుకున్నారు. స్వార్ధంతో చెట్లను నరకడం మంచిదికాదనే సందేశాన్ని ఆముదాల సుబ్రహ్మణ్యం రచన, దర్శకత్వంలో ఆకట్టుకునేలా ప్రదర్శించారు. మూడో ప్రదర్శనగా ‘కలనేత’ నాటకాన్ని ప్రదర్శించారు. ఆకెళ్ల రచనకు బిఎం రెడ్డి దర్శకత్వం వహించారు. ‘చీకటిపువ్వు’ నాటిక చక్కని సందేశాన్ని అందించింది. చేసిన తప్పులు తెలుసుకొని పశ్చాత్తపడిన తర్వాత కూడా అలాంటి వారిని దూరం పెట్టకూడదని సందేశాత్మకంగా నాటకం సాగింది. మూలకధ పిఎస్‌ నారాయణ, నాటకీకరణ, రచన, పరమాత్ముని శివరాం, దర్శకత్వం రమేష్‌ మంచాల వహించారు.
ఆదర్శవంత ప్రదర్శన ఉద్ధమ్‌ సింగ్‌
భరతమాత బానిస సంకెళ్లు తెంచడానికి స్వాతంత్య్ర సంగ్రామంలో ఎందరో వీరులు పోరాటం చేశారు. అలాంటి వారిలో ఉరికంబాన్ని ముద్దాడి దేశం కోసం ప్రాణత్యాగం చేసిన ఉద్దంసింగ్‌ ఆదర్శ జీవితాన్ని నాటికలో చక్కగా చూపించారు. ఈ నాటికకు కథ, మాటలు, దర్శకత్వాన్నిపి.వివేక్‌ అందించారు.
త్రిజుడు
‘త్రిజుడు’ నాటికకు మూలకధ పి.వి.వి.సత్య నారాయణ, నాటకీకరణ యల్లాప్రగడ భాస్కరరావు అందించారు. వై.ఎస్‌.కష్ణేశ్వరరావు దర్శకత్వంలో చక్కగా ప్రదర్శితమైంది. కులం, మతం, పుట్టుక, డబ్బు ఇవేవీ మనిషి మంచితనా నికి గీటురాళ్లు కాదు. ఒక్క మానవత్వం మాత్రమే మనిషిని మనిషిగా ప్రపంచానికి చూపెడుతుందన్న సత్యాన్ని నాటిక ద్వారా ప్రేక్షకులు అందుకున్నారు.
ప్రేక్షకులను ఆకట్టుకున్న గమ్యస్తానాల వైపు
‘గమ్యస్థానాల వైపు’ నాటికలో సందేశం ప్రేక్షకుల హదయాలకు చక్కగా అందింది. సమస్య చిన్నదైనా, పెద్దదైనా ఎదిరించి ముందుకెళ్ళాలి. నిరాశా నిస్పహలతో జీవితాన్ని నాశనం చేసుకో కూడదు. మన ప్రాణాన్ని మనమే చంపుకుంటే అది ఆత్మహత్య అవ్వదు, హత్యగానే పరిగణించ బడుతుంది.

Spread the love