– టీఎంఆర్ఎస్ పాఠశాల లో తనిఖీ చేసిన ప్రత్యేక అధికారి ప్రదీప్ కుమార్
నవతెలంగాణ – అశ్వారావుపేట : ఇటీవల అశ్వారావుపేట నియోజకవర్గంలోని దమ్మపేట మండలం గండుగులపల్లి ఏకలవ్య పాఠశాల విద్యార్థులు అస్వస్థతకు గురైన నేపధ్యంలో మండలంలో ప్రభుత్వ పాఠశాలలను సందర్శించడానికి ప్రభుత్వం తనిఖీ అధికారులను నియమించారు.
ఈ క్రమంలో బుధవారం మండల పరిషత్ ప్రత్యేక అధికారి పశుసంవర్ధక శాఖ అదనపు సంచాలకులు డాక్టర్ ప్రదీప్ కుమార్ టీఎంఆర్ఎస్ అశ్వరావుపేట (జి)-1 పాఠశాల లో తనిఖీ చేశారు.
మండలం లోని అన్ని యాజమాన్యాల పరిధిలో 15 వసతి గృహాలు ఉన్నాయి.ప్రతీ రెండేసి వసతి గృహాలకు మండల పరిషత్ ప్రత్యేక అధికారి, పశుసంవర్ధక శాఖ అదనపు సంచాలకులు డాక్టర్ ప్రదీప్ కుమార్ తో పలువురు మండల స్థాయి అధికారులను నియమించారు.
టీఎంఆర్ఎస్ అశ్వరావుపేట (జి)-1 లో 212 మంది విద్యార్థులు ఉన్నారు,టీఎంఆర్జేసీ అశ్వరావుపేట (జి)-1 లో 125 మంది విద్యార్థులు ఉన్నారు.ఈ రెండు పాఠశాలలను తహశీల్దార్ సీహెచ్వీ రామక్రిష్ణ తనిఖీ చేస్తారు.
ఎంజేపీటీ బీసీ డబ్ల్యుఆర్ స్కూల్ అశ్వారావుపేట బాలికలు వసతి గృహంలో 306 విద్యార్థులు, ఎంజేపీటీ బీసీ డబ్ల్యుఆర్ స్కూల్ అశ్వారావుపేట బాలురు వసతి గృహంలో 289 మంది విద్యార్థులు ఉన్నారు.ఈ రెండు పాఠశాలలను ఎస్.హెచ్.ఓ ఎస్.ఐ యయాతి రాజు తనిఖీ చేస్తారు.
ప్రభుత్వం ఎస్సీ డీ డీ బాలుర హాస్టల్ అశ్వారావుపేట లో 35 మంది విద్యార్థులు ఉన్నారు.
ప్రభుత్వ బీసీ బాలుర వసతి గృహం అశ్వారావుపేట లో 79 మంది విద్యార్థులు ఉన్నారు.ఈ రెండు వసతి గృహాలను ఎంపీడీవో అప్పారావు తనిఖీ చేస్తారు.
ఏజీహెచ్ఎస్ అనంతారం లో 123 మంది,ఏజీహెచ్ఎస్ భీముని గూడెంలో 333 మంది విద్యార్థులు ఉన్నారు.ఈ రెండు పాఠశాలలను ఎంఈఓ ప్రసాదరావు తనిఖీ చేస్తారు.
ఏజీహెచ్ఎస్ అశ్వారాపేట లో 227 మంది,ఏజీహెచ్ఎస్ కవాడిగుండ్ల లో 123 మంది విద్యార్థులు ఉన్నారు.ఈ రెండు పాఠశాలలను వ్యవసాయ శాఖ మండల అధికారి పి.శ్రీనివాస్ తనిఖీ చేస్తారు.
ఏహెచ్ఎస్ పీవీ ప్రాజెక్ట్ లో 132 మంది విద్యార్థులు ఉన్నారు.
ఏహెచ్ఎస్ సున్నం బట్టి లో 130 మంది విద్యార్థులు ఉన్నారు.ఈ రెండు పాఠశాలలను ఏసీడీపీఓ అలేఖ్య తనిఖీ చేస్తారు.
ఎస్టీ బీహెచ్ అశ్వారావుపేట లో 50 మంది విద్యార్థులు ఉన్నారు.
పిఎంహెచ్ (బాలికలు) అశ్వరావుపేట లో 72 మంది విద్యార్థులు ఉన్నారు.ఈ రెండు వసతి గృహాలను ఎంపీఓ రెడ్డం రామ కోటా రెడ్డి తనిఖీ చేస్తారు.



