Wednesday, March 18, 2026
E-PAPER
Homeఖమ్మంజిల్లా స్థాయిలో సత్తా చాటుతున్న ప్రాధమిక విద్యార్థులు 

జిల్లా స్థాయిలో సత్తా చాటుతున్న ప్రాధమిక విద్యార్థులు 

- Advertisement -

– విద్యాశాఖ ప్రతిష్టను ఇనుమడింప జేస్తున్న పీఎం శ్రీ పాఠశాల 
నవతెలంగాణ – అశ్వారావుపేట : పోటీ ఏదైనా కావచ్చు విజయం మా సొంతం అంటూ పాఠశాల ప్రతిష్టను,కాంప్లెక్స్ ప్రతిష్టను, మండల ప్రతిష్టను జిల్లా స్థాయిలో ఇనుమడింపజేస్తున్నారు పీఎం శ్రీ ఎంపీయూపీఎస్ నారంవారిగూడెం విద్యార్థులు. 

గత రెండు సంవత్సరాల నుండి మండలంలో ఏ ప్రతిభా పాఠవ పోటీలు జరిగినా అది పాఠశాల స్థాయి కావచ్చు, కాంప్లెక్స్ స్థాయి కావచ్చు, మండల స్థాయి కావచ్చు పోటీ అనేది జరిగితే అందులో అధిక శాతం ప్రథమ బహుమతులు నారంవారిగూడెం విద్యార్థులే సాధిస్తున్నారు.

గత ఏడాది జరిగిన బాలమేళ పోటీల్లో కాంప్లెక్స్ స్థాయి,మండల స్థాయి పోటీల్లో నారంవారిగూడెం విద్యార్థులే ఎక్కువ బహుమతులు సాధించారు.

ఈ సంవత్సరం ఫిబ్రవరి 28 న జరిగిన బాలమేళ 2.0 లో కూడా అచ్యుతాపురం కాంప్లెక్స్ స్థాయి లో పది అంశాలకుగాను ఐదు అంశాలలో ప్రథమ బహుమతులు, రెండు ద్వితీయ బహుమతులు సాధించారు.మార్చి 5 న అశ్వారావుపేట మండల స్థాయి పోటీల్లో పాల్గొని నాలుగు మొదటి బహుమతులు,ఆరు ద్వితీయ బహుమతులు మొత్తం పది బహుమతులు సాధించిన ఘనత నారంవారిగూడెం విద్యార్థులదే. అనంతరం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా స్థాయిలో మార్చి 11 న జరిగిన బాలమేళ 2.0 పోటీల్లో కూడా పాల్గొన్న నారంవారిగూడెం విద్యార్థిని చిరంజీవి ఉషారాణి జిల్లా మొదటి బహుమతి సాధించి డీఈఓ చేతుల మీదుగా అవార్డు అందుకుంది.మంగళవారం ఊట్లపల్లి లో జరిగిన యూపీ లెవెల్ క్విజ్ పోటీల్లో మొదటి బహుమతి,ఇంగ్లీష్ హ్యాండ్ రైటింగ్ లో రెండు ప్రథమ బహుమతులు, టాలెంట్ టెస్ట్ లో ద్వితీయ బహుమతులు సాధించి మండలంలో నారంవారిగూడెం విద్యార్థులు “ది బెస్ట్” అని మరొకసారి నిరూపించారు. ఇదంతా వారి వెనుకుండి నడిపించిన ఉపాధ్యాయుల కృషి ఫలితమే.అంకిత భావం కలిగిన ఉపాధ్యాయ బృందం,వారికి దిశా నిర్దేశం చేస్తూ ప్రధానోపాధ్యాయుడు పున్నం చంద్రశేఖర్ రావు విద్యార్థులను నిర్ధిష్టమైన ప్రణాళిక ప్రకారం తీర్చి దిద్ది నారంవారిగూడెం కీర్తిని జిల్లా స్థాయిలో చాటేలా చేశారు. 

ఈ విజయోత్సవ వేడుకల సందర్భంగా గ్రామ సర్పంచ్ మనుగొండ నాగమణి,అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ ఛైర్మన్ తట్టుకోళ్ళ బసవమ్మ, కమిటీ సభ్యులు, గ్రామ పెద్దలు, కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయురాలు షాహిన బేగం,మండల విద్యాశాఖ అధికారి పొన్నగంటి ప్రసాదరావులు తదితరులు అభినందించారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు శ్రీ బండి శ్రీనివాస రెడ్డి,రేణుక, కొచ్చర్ల శ్రీనివాస రావు ,ఆశిక్ ఆలం,సోయం రవిబాబు, మంగమ్మ, రజని, కవిత, ఉషారాణి తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -