Wednesday, March 18, 2026
E-PAPER
Homeఖమ్మంప్రభుత్వం ఇచ్చినా రైతుకు చేరని లబ్ధి

ప్రభుత్వం ఇచ్చినా రైతుకు చేరని లబ్ధి

- Advertisement -

– రైతుల అవగాహనా రాహిత్యం
– అధికారుల అలసత్వం
– ట్రెసరీలో మూలుగుతున్న భరోసా సొత్తు
నవతెలంగాణ – అశ్వారావుపేట : రైతే రాజు,రైతే దేశానికి వెన్నెముక అంటూ వేదికలు పై ప్రసంగాలు దంచే విదాతలు క్షేత్రస్థాయిలో వారి బాధలు,వేదనలు పట్టించుకోరు. రైతును ఆర్ధికంగా అండగా ఉండటానికి ప్రభుత్వం అమలు చేస్తున్న రైతు భరోసా కొందరు రైతులకు దూరమవుతుంది.  రైతు భరోసా పైకాన్ని నేరుగా రైతుల ఖాతాల్లో జమ చేసి దళారి వ్యవస్థను లేకుండా చేయడం కోసం ప్రభుత్వం  రైతు భరోసా డీబీటీ ద్వారా ట్రెజరీలో జమ చేయడం అంటే ప్రభుత్వం రైతులకు ఇవ్వాల్సిన ఆర్థిక సహాయాన్ని( డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్)విధానంలో నేరుగా వారి బ్యాంక్ ఖాతాల్లో జమ చేయడం.
ఈ విధానంలో ప్రభుత్వం అర్హులైన రైతుల జాబితా సిద్ధం చేస్తుంది.
రైతుల ఆధార్, బ్యాంక్ ఖాతా వివరాలు ధృవీకరిస్తారు. ట్రెజరీ శాఖ ద్వారా నిధులు విడుదల చేస్తారు. డీబీటీ విధానం ద్వారా నేరుగా రైతుల బ్యాంక్ ఖాతాల్లోకి బ్బు జమ అవుతుంది. మధ్యవర్తులు లేకుండా రైతులకు నేరుగా ప్రయోజనం చేరుతుంది. దీనివల్ల అవినీతికి ఆస్కారం లేదు. డబ్బు నేరుగా రైతుకే చేరుతుంది. పారదర్శకత పెరుగుతుంది. చెల్లింపులు త్వరగా జరుగుతాయి. అయితే రైతులు తమ బ్యాంక్ ఖాతా ఆధార్ తో లింక్ అయి ఉందా లేదా,ఈ – కేవైసీ పూర్తి అయ్యిందా లేదా, భూ రికార్డులు సరిగ్గా ఉన్నాయా అనేది చెక్ చేసుకుని సంబంధించిన అధికారులకు వారి వివరాలు ఇవ్వాల్సిన అవసరం ఉంది.అయితే ఇవన్నీ మంచిగానే ఉన్నా దేవుడు వరమిచ్చినా పూజారి  అనుమతి కావాలి అన్నచందంగా ఉంది వ్యవసాయ శాఖ పనితీరు.
రైతులకు అవగాహనలేమి,అధికారులు పొరపాట్లు తో అనేక మంది రైతులు తమ రైతు భరోసా నిధులు తమ ఖాతాలో జమ కాక పోవడంతో కొట్లాటి సొత్తు ట్రెజరీ లో మూలుగుతుంది.
అశ్వారావుపేట పేట నియోజకవర్గం లోని 5 మండలాల్లో 172 మంది రైతులకు రావాల్సిన రైతు భరోసా పైకం అక్షరాలా రూ. 22 లక్షల49 వేల,700 లు నష్టపోయారు.
డీబీటీ ఫెయిల్ కావటానికి కారణాలు ఇవీ.
1.బ్యాంకు అకౌంట్ నెంబర్ తప్పుగా నమోదు కావడం,
2.బ్యాంకు అకౌంట్ లైవ్ లో లేకపోవట,
3.బ్యాంకు అకౌంట్, బ్రాంచ్,ఐఎఫ్ఎస్సీ కోడ్ మ్యాచ్ కాకపోవటం,
4.బ్యాంకు అకౌంట్ ఈ – కేవైసీ కాకపోవటం ,
5.బ్యాంకు అకౌంట్ ఆధార్ కు లింక్ కాకపోవటం.
కారణం ఏదేమైనా, రైతు భరోసా డబ్బులు రైతు ఖాతాలో జమ అయ్యేలా అటు రైతు, మరో వైపు వ్యవసాయ శాఖ అధికారులు అప్రమత్తం గా ఉండి రైతుకు డీబీటీ విజయవంతం అయ్యేలా చేయాలి అని రైతులు కోరుతున్నారు.
వ్యవసాయ శాఖ సహాయ సంచాలకులు – పెంటేల రవి కుమార్:
 కారణం ఏదైనా,కారకులు ఎవరైనా డీబీటీ ఫెయిల్ అయిన రైతుల బ్యాంకు వివరాలు పరిశీలించి మరొకసారి రైతులతో విచారించి సరిపోల్చుకోవటం జరుగుతుంది.
ఇవి ఎప్పటికప్పుడు సరిచేయటం మళ్ళీ సబ్మిట్ చేయటం జరుగుతుంది.దీనివలన, డి బి టీ ఫెయిల్ అయిన రైతులకు కూడా రైతు భరోసా జమ అవుతాయి.
అధికారాలు తప్పిదం వల్లే నాకు రైతు భరోసా చేరలేదు – రైతు తల్లిబోయిన చెన్నారావు.
దమ్మపేట మండలం,మందలపల్లి రెవిన్యూ గ్రామం లో నాకు 5.5 ఎకరాలు వ్యవసాయ భూమికి రూ.33 వేలు నాకు రైతు భరోసా కు అర్హత ఉంది.నా భూమికి సంబంధించిన అన్ని వివరాలు సకాలంలో అందించాను.అయితే నా బ్యాంక్ ఖాతా నెంబర్ సిబ్బంది తప్పుగా నమోదు చేయడం వల్ల నా ఖాతా లో రైతు భరోసా జమ కాలేదు.సంవత్సరకాలం ఎదురు చూస్తున్నాను.
గత సంవత్సరం డీబీటీ ఫెయిల్ అయిన రైతుల వివరాలు.

మండలం               రైతులు          రైతు బరోసా

అన్నపురెడ్డిపల్లి         24                  2.76 లక్షలు 

అశ్వారావుపేట          48                 7.98 లక్షలు 

చంద్రుగొండ               11                  0.94 లక్షలు 

దమ్మపేట                   55                 6.61 లక్షలు 

ములకలపల్లి              34                 4.18 లక్షలు

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -