Wednesday, March 18, 2026
E-PAPER
Homeఆటలుఎస్‌ఆర్‌హెచ్ కెప్ట‌న్‌గా ఇషాన్ కిషాన్

ఎస్‌ఆర్‌హెచ్ కెప్ట‌న్‌గా ఇషాన్ కిషాన్

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్‌: ఐపీఎల్ సీజన్ 2026 ప్రారంభం కానున్న నేపథ్యంలో ఎస్‌ఆర్‌హెచ్ యాజమాన్యం కీలక నిర్ణయం తీసుకుంది. జట్టు కెప్టెన్‌గా ఇషాన్ కిషన్‌ను నియమించింది. అయితే, ఈ నిర్ణయం తాత్కాలికమే. ఎస్‌ఆర్‌హెచ్ జట్టుకు కొన్ని సీజన్ల నుంచి రెగ్యులర్ కెప్టెన్‌గా వ్యవహరిస్తున్న ఆస్ట్రేలియా ఆటగాడు పాట్ కమిన్స్ కొన్ని ప్రారంభ మ్యాచులకు అందుబాటులో ఉండటం లేదు. దీంతో కమిన్స్ ఎస్‌ఆర్‌హెచ్ జట్టుతో చేరేవరకు ఇషాన్ కిషన్ కెప్టెన్‌గా వ్యవహరిస్తాడు. ఈ విషయాన్ని జట్టు యాజమాన్యం బుధవారం అధికారికంగా వెల్లడించింది.

మరోవైపు ఎస్‌ఆర్‌హెచ్ స్టార్ ఓపెనర్ అభిషేక్ శర్మ వైస్ కెప్టెన్‌గా వ్యవహరిస్తాడు. ఇటీవలి టీ20 వరల్డ్ కప్‌లో ఇషాన్ కిషన్ అద్భుతంగా రాణించిన సంగతి తెలిసిందే. జట్టు విజయంలో కీలక పాత్ర పోషించి ట్రోఫీని అందించాడు. ఈ నెల 28 నుంచి ఐపీఎల్‌ 19వ సీజన్ ప్రారంభం కానుంది. తొలి మ్యాచులోనే ఎస్‌ఆర్‌హెచ్, ఆర్సీబీ తలపడనున్నాయి.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -