నవతెలంగాణ-హైదరాబాద్: జగిత్యాల జిల్లాలో సంచలనం సృష్టించిన యూట్యూబర్ వైష్ణవి హత్య కేసును పోలీసులు ఛేదించారు. అదనపు కట్నం కోసమే ఆమె భర్త హత్య చేశాడని పోలీసులు వెల్లడించారు. నిందితుడు హరిబాబు, వైష్ణవిని అదనపు కట్నం కోసమే హత్య చేసినట్లు పోలీసుల విచారణలో అంగీకరించాడు. నిందితుడిని అరెస్ట్ చేసిన పోలీసులు, కోర్టులో హాజరుపరిచి రిమాండ్కు తరలించారు.
ఈ కేసులో సంచలన ఆడియో కాల్ లీక్ అయింది. ఈ ఆడియో కాల్లో వైష్ణవి హత్యకు ముందు ఆమె అత్తతో మాట్లాడింది. వైష్ణవిని హరిబాబు తల్లి లక్ష్మి అభ్యంతరకరంగా ధూషించినట్లు ఈ ఆడియో కాల్లో ఉంది. బెడ్ రూమ్లో ఉంగరం దొంగిలించారని అభ్యంతరకంగా హరిబాబు తల్లి మాట్లాడింది. తల్లితో ఫోన్ మాట్లాడినప్పుడు వైష్ణవితోనే హరిబాబు ఉన్నారు. ఉంగరం పేరుతో నాటకాలు ఆడవద్దని తన తల్లిని హరిబాబు హెచ్చరించారు.



