Wednesday, March 18, 2026
E-PAPER
Homeక్రైమ్కారు చెట్టుకు ఢీకొని ఇద్దరు యువకులు మృతి..

కారు చెట్టుకు ఢీకొని ఇద్దరు యువకులు మృతి..

- Advertisement -

– ఒకరికి తీవ్ర గాయాలు అయ్యాయి 
– 108 సాయంతో ఆసుపత్రికి తరలించిన స్థానికులు 
నవతెలంగాణ-  మిరుదొడ్డి : కారు అదుపుతప్పి చెట్టు ఢీకొని ఇద్దరు యువకులు మృతి చెందిన సంఘటన మిరుదొడ్డి మండల కేంద్రంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. మిరుదొడ్డి నుండి ఆల్వాల వైపు వెళ్తున్న కారు అదుపుతప్పి చెట్టును ఢీ కొట్టి, విద్యుత్ పోల్ పై వాలింది. కారులో ఉన్నవారికి తీవ్ర రక్తస్రావం కావడంతో స్థానికులు గమనించి కారులో నుండి క్షతగాత్రులను బయటికి తీశారు. మిరుదొడ్డి గ్రామానికి చెందిన వారిగా స్థానికులు గుర్తించారు.  తీవ్ర గాయాలైన ముగ్గురిని 108 వాహనంలో సిద్దిపేట ఆసుపత్రికి తరలించారు. గ్రామానికి చెందిన చెన్నై నితిన్, మరో యువకుడు  పిట్ల రామ్ చరణ్ ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందారు. సాన హర్షవర్ధన్ కు తీవ్ర గాయాలు కావడంతో ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందడంతో మిరుదొడ్డి గ్రామంలో తీవ్ర విషాదఛాయలు అలుముకున్నాయి. స్థానిక స్థలానికి పోలీసులు చేరుకొని దర్యాప్తు చేసి కేసు నమోదు చేసినట్లు మీరు దొడ్డి ఎస్సై సమంత తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -