– ఎస్ ఐ ఎస్ కె తాజుద్దిన్
నవతెలంగాణ గోవిందరావుపేట : యువతరం ముందు తరానికి ఆదర్శం కావాలని పసర పోలీస్ స్టేషన్ ఎస్ఐ ఎస్.కె తాజుద్దీన్ అన్నారు. బుధవారం మండలంలోని పలు గ్రామాలలో యువతకు సలహాలు సూచనలు ఎస్ ఐ చేశారు
నేటి సమాజంలో యువత వక్రమార్గంలోకి నడవకుండా, మత్తుకు బానిస అవకుండా, త్రిబుల్ రైడింగ్,అధిక స్పీడు గా వాహనాలు నడపకుండా మండలంలోని యువతకు అవగాహన కల్పిస్తున్నారు. క్రమశిక్షణలో భాగంగా బుధవారం నాడు హెయిర్ కట్ పై అవగాహన కల్పిస్తూ స్వయంగా సెలూన్ షాపులకు తీసుకెళ్లి కటింగ్ చేయించి యువత ఇలాగే ఉండాలి అని వారికి సూచనలు చేసినారు.యువకులు ఇంట,బయట పెద్దలతో మర్యాదగా నడుచుకోవాలని,చదువులో ఉన్నత శిఖరాలకు చేరుకొని విద్యావంతులై ఉద్యోగాలు చేసుకొని జీవితంలో స్థిరపడాలని యువతకు సూచనలు చేసినారు.



