Wednesday, March 18, 2026
E-PAPER
Homeకరీంనగర్ఇందిరమ్మ ఇళ్లకు ఉచిత విద్యుత్ స్తంభాలు,మీటర్లు ఇవ్వాలి

ఇందిరమ్మ ఇళ్లకు ఉచిత విద్యుత్ స్తంభాలు,మీటర్లు ఇవ్వాలి

- Advertisement -

నవతెలంగాణ-రాయికల్: మండలంలోని మైతాపూర్ గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద మంజూరైన గృహాల నిర్మాణాలకు సంబంధించిన విద్యుత్ సదుపాయాలు కల్పించాలని స్థానిక ప్రజాప్రతినిధులు డిమాండ్ చేశారు. గ్రామంలో మంజూరైన 45 ఇళ్లలో సుమారు 30 ఇళ్లు వివిధ దశల్లో పూర్తి కావస్తున్న నేపథ్యంలో ఆయా గృహాల వరకు విద్యుత్ స్తంభాలు ఏర్పాటు చేసి,వైరింగ్ పూర్తి చేయాలని కోరారు.

ఇందిరమ్మ ఇళ్లు నిర్మించుకున్న లబ్ధిదారులకు ఉచితంగా విద్యుత్ మీటర్లు అందించాలని విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు గ్రామ 8వ వార్డ్ సభ్యుడు బుస గంగా మల్లయ్య, స్థానిక నాయకుడు అనుమల్ల సత్యనారాయణ విద్యుత్ శాఖ ఏఈ నవీన్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -