- సర్కార్ ఆధ్వర్యంలో రవీంద్రభారతిలో ఘనంగా ఉగాది వేడుకలు
నవతెలంగాణ-హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉగాది పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. రాష్ట్రంలో రైతు నామ సంవత్సరంగా తెలుగు సంవత్సరం ఉగాది పండుగ జరుపుకుంటున్నారని సీఎం చెప్పారు. సర్కార్ ఆధ్వర్యంలో ఉగాది వేడుకలు రవీంద్రభారతిలో ఘనం జరిగాయి. ఈ కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డి తో పాటు పలువురు మంత్రులు హాజరయ్యారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. రాష్ట్రంలో రైతులకు, రైతు కూలీలకు ఉగాది గొప్ప పండుగ అని చెప్పారు. రాష్ట్రంలో రైతులను రాజును చెయ్యాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ముందుకు సాగుతుందని సీఎం గుర్తుచేశారు. రాష్ట్రంలో రైతులు పండించిన పంటలకు బోనస్ అందించి దేశంలో తక్కువ అప్పులు ఉన్న రాష్ట్రంగా తెలంగాణ రైతులు రాష్ట్రాన్ని నిలిపారని సీఎం హర్షం వ్యక్తం చేశారు.



