- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్: అసెంబ్లీ ఎన్నికల వేళ తమిళనాడులో రాజకీయ పార్టీల మార్పులు ఊపుందుకున్నాయి. అధికార పార్టీ డీఎంకేలోకి పలు పార్టీల రాజకీయ నాయకులు క్యూకడుతున్నారు. అసెంబ్లీ ఎన్నికలకు ముందు తమిళగ వెట్రి కజగం (టీవీకే) మాజీ నేత రంజనా నాచియార్ గురువారం ద్రవిడ్ మున్నేట్ర కజగంలో చేరారు. డీఎంకేలో చేరిన తర్వాత ఆమె తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌తో సమావేశమయ్యారు. టీవీకే నాయకుడు విజయ్ కపటత్వం, అందరితో కలవకపోవడం, మహిళలను అగౌరవపరచడం వంటి ఆరోపణలే తన పార్టీ మార్పుకు కారణమని ఆమె పేర్కొన్నారు. ప్రజావిశ్వాసంతో అధికారంలో ఉన్న పార్టీ కాబట్టి డీఎంకేలో చేరినట్లు ఆమె అన్నారు.
- Advertisement -



