Thursday, March 19, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్రాజకీయంగా ఎదుర్కోలేక కాంగ్రెస్ పై బురద జల్లుతున్న బీజేపీ

రాజకీయంగా ఎదుర్కోలేక కాంగ్రెస్ పై బురద జల్లుతున్న బీజేపీ

- Advertisement -

కాంగ్రెస్ పై బురద చల్లుతున్న బీజేపీ నాయకులారా ఖబర్దార్

చండూరు మున్సిపల్ చైర్మన్ డాక్టర్ కోడి శ్రీనివాసులు

నవతెలంగాణ – చండూర్:

ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ 10 వార్డులలో పోటీ చేసి ఒక్క వార్డ్ గెలవకుండా, ఘోరంగా విఫలం చెంది, రాజకీయంగా ఎదుర్కోలేక కాంగ్రెస్ పై బురద జల్లుతుందని చండూరు మున్సిపల్ చైర్మన్ డాక్టర్ కోడి శ్రీనివాసులు  మండిపడ్డారు. గురువారం స్థానిక అతిథి గృహంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఇటీవల జరిగిన గొడవకు కాంగ్రెస్ పార్టీకి ఎలాంటి సంబంధం లేదన్నారు.

వ్యక్తిగత కారణాలతో జరిగిన గొడవను కాంగ్రెస్ పార్టీపై రుద్దుతున్న బీజేపీ నాయకులారా ఖబర్దార్ అంటూ హెచ్చరించారు. రిమాండ్ కు పంపబడ్డ 16 మందిలో 12 మంది బిఆర్ఎస్ నాయకులు ఉండగా కేవలం నలుగురు మాత్రమే కాంగ్రెస్ కార్యకర్తలు ఉన్నారన్నారు. చండూరులో బీఆర్ఎస్- బీజేపీ నాయకులకు అక్రమ సంబంధం ఉండడంతో బిఆర్ఎస్ ను నిందించకుండా కేవలం కావాలనే కాంగ్రెస్ పార్టీ పైన బురద జల్లుతూ కాంగ్రెస్ గుండాలంటూ మాట్లాడుతున్నారన్నారు.కావాలనే కోమటిరెడ్డి బ్రదర్స్ కోడి బ్రదర్స్ పైన నిందలు మోపుతూ పిచ్చలవిడిగా అవాకులు చేస్తున్నారన్నారు.

ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి నియోజకవర్గంలో 12 విడతల్లో 1970 మందికి కంటి ఆపరేషన్ చేయించారని అందులో 400 కుటుంబాలకు పైగా బిజెపి కుటుంబాలే ఉన్నాయన్నారు. బీజేపీ నాయకులు కళ్ళుండి చూడలేని కబోదులు అన్నారు. డాక్టర్ జి.మనోహర్ రెడ్డి,నాగ వర్షిత్ రెడ్డి కూడా వస్తే వారికి కూడా కంటి ఆపరేషన్ చేయించేందుకు తాము సిద్ధంగా ఉన్నామన్నారు. చండూరులో ఉండే ప్రశాంత వాతావరణన్ని బీజేపీ నాయకులు చెడగొడుతున్నారని బిజెపి నాయకులు రెచ్చగొడితే సహించేది లేదని త్వరలోనే అన్ని పార్టీల నాయకులను కూర్చోబెట్టి తిరిగి చండూరులో ప్రశాంత వాతావరణ నెలకొలుపుతామన్నారు.

డాక్టర్ జి.మనోహర్ రెడ్డి బీజేపీకి పట్టిన దరిద్రం: మాజీ సర్పంచ్ కోడిగిరిబాబు

డాక్టర్ జి మనోహర్ రెడ్డి నియోజకవర్గ బిజెపికి పట్టిన దరిద్రమని మాజీ సర్పంచి కోడిగిరిబాబు విమర్శించారు. ఆయనకు ఎన్నికల్లో ఎన్ని ఓట్లు వచ్చాయో ఒకసారి గుర్తు తెచ్చుకోవాలన్నారు. బీజేపీ నుంచి పోటీ చేసిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గెలుపు అంచులకు వచ్చారు అని గుర్తు చేశారు. గొడవకు కారణమైన దోటి కిరణ్ ఓ ఇసుక వ్యాపారి అని తుమ్మలపల్లి లో జరిగిన చిల్లర పంచాయతీని గొడవలు దాకా తీసుకువచ్చి పార్టీలకు రుద్ధాదని అన్నారు. పోలీసులు ఏకపక్షంగా వ్యవహరించి గొడవలో లేని వారిని కూడా రిమాండ్ పంపించారని తెలిపారు. ఎదుటి వర్గానికి కూడా దెబ్బలు తగిలాయని కానీ పోలీసులు వారి ఫిర్యాదును పట్టించుకోలేదన్నారు. దళితుడి పైన దాడి జరిగితే కనీసం పోలీసులు పిటిషన్ కూడా తీసుకోలేదు అన్నారు. ఇప్పటికైనా బాధితులకు న్యాయం జరగకపోతే త్వరలోనే చండూరు బంద్ కు పిలుపునిస్తామన్నారు.

ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ భూతరాజు దశరథ, కౌన్సిలర్లు కటకం రమేష్, వాసు, మాజీ కౌన్సిలర్ కోడి వెంకన్న, పున్న ధర్మేందర్, కల్లెట్ల మారయ్య, భీమనపల్లి శేఖర్, ఐయితరాజు మల్లేష్, బ్రహ్మం, ఇరి వెంకటేశం, గజ్జల కృష్ణారెడ్డి, లతీఫ్ ఖలీల్, జన్ను, వెంకన్న, దశరథ,ఐమద్, నాగరాజు,పందుల సత్యం, రవి, రామ్మూర్తి తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -