Thursday, March 19, 2026
E-PAPER
Homeఆదిలాబాద్పీసిఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉగాది పచ్చడి పంపిణీ

పీసిఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉగాది పచ్చడి పంపిణీ

- Advertisement -

నవతెలంగాణ-జన్నారం : పూర్ణచంద్రరావు ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉగాది పండుగ పర్వదినాన్ని పురస్కరించుకొని గురువారం జన్నారం మండల కేంద్రంలో ఉగాది పచ్చడిని పంపిణీ చేశారు. ముందుగా ఫౌండేషన్ ఆధ్వర్యంలో వేద పండితులు మాసం రాజన్న పూజలు నిర్వహించారు. అనంతరం పచ్చడితోపాటు బూరెలను అందజేశారు. ఈ కార్యక్రమంలో పి సి ఆర్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు ముడుగు ప్రవీణ్ కుమార్, పొనకల్ ఉపసర్పంచ్ అప్పాల జలపతి, పొనకల్ మాజీ ఎంపిటిసి రాగుల శంకర్, బిజెపి మండల మాజీ అధ్యక్షులు గోలిచందు, బిఆర్ఎస్ మండల ప్రధాన కార్యదర్శి సులువ జనార్దన్ , మాజీ కో ఆప్షన్ సభ్యులు మున్వర్ అలీ ఖాన్, కాంగ్రెస్ జిల్లా నాయకులు ముత్యం రాజన్న, ఫౌండేషన్ సభ్యులు బీన వేణి గంగన్న యాదవ్, చింతల సతీష్, తిరుపతి, దేవేందర్ తదితరులు పాల్గొన్నారు

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -