Thursday, March 19, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ నూతనంగా నిర్మించిన ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశాలు ప్రారంభం 

 నూతనంగా నిర్మించిన ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశాలు ప్రారంభం 

- Advertisement -

– హాజీరైన  మాచారెడ్డీ మాజీ ఎంపీపీ నర్సింగ్ రావు
నవతెలంగాణ –  కామారెడ్డి : కామారెడ్డి జిల్లా  మాచారెడ్డీ మండలం గజ్యా నాయక్ తండ గ్రామంలో నూతనంగా నిర్మించిన ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశ కార్యక్రమానికి మాచారెడ్డి మండలం మాజీ ఎంపీపీ నర్సింగ్ రావు  అతిథిగా హాజరయ్యారు. సుదనమైన లక్ష్మి, కర్రెపు నర్సవ్వ  వీరిద్దరి ఇందిరమ్మ ఇండ్ల గృహప్రవేశము జరుపుకున్నారు. ఇంద్రమిండ్ను ప్రారంభించిన అనంతరం నర్సింగ్ రావు మాట్లాడుతూ ప్రభుత్వం ఇచ్చేటటువంటి ఇందిరమ్మ ఇండ్ల పథకం నిరుపేదలు సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. లబ్ధిదారులకు నర్సింగ్ రావు శుభాకాంక్షలు తెలిపారు. 

సీఎం రేవంత్ రెడ్డి పాదయాత్ర సమయంలో కూలిపోయిన ఇళ్లను చూసి చలించిపోయి, అధికారంలోకి రాగానే ఇళ్లను నిర్మించి ఇస్తామని ఇచ్చిన హామీని నిలబెట్టుకున్నారని తెలిపారు. ఇచ్చిన మాట ప్రకారం ఇళ్ల నిర్మాణం పూర్తి చేసి గృహప్రవేశం చేయించడం ప్రభుత్వనికి  ప్రజల పట్ల ఉన్న నిబద్ధతకు నిదర్శనమని అన్నారు. గజ్యా నాయక్ తండాలో నిర్మాణంలో ఉన్న మరికొన్ని ఇందిరమ్మ ఇళ్లను  త్వరలో పూర్తి చేసుకోవాలని లబ్ధిదారులకు సూచించారు. అనంతరం ఎల్లంపేటలో గ్రామ ప్రజలతో ఉగాది ఉత్సవాలలో పాల్గొని, అలాగే సేవాలాల్, జగదాంబ దేవి, హనుమాన్ ఆలయ పూజా కార్యక్రమంలో పాల్గొని, తిరిగి హైదరాబాద్ కు ప్రయాణమయ్యారు.

ఈ కార్యక్రమంలో  గ్రామ సర్పంచ్ రావుల వినోద ప్రభాకర్, ఉప సర్పంచ్ భిక్షపతి, పార్టీ ప్రెసిడెంట్ బన్సీ నాయక్, జిల్లా వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్ కొత్త అరవింద్, మాచారేడ్డి సర్పంచ్ సంతోష్, భవానిపేట మాజీ సర్పంచ్ మద్దేల రాజు, గ్రామస్తులు, పార్టీ నాయకులు  తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -