Thursday, March 19, 2026
E-PAPER
Homeఆదిలాబాద్ఆలరించిన  కుస్తీ పోటీలు 

ఆలరించిన  కుస్తీ పోటీలు 

- Advertisement -

నవతెలంగాణ కుభీర్ : మండల కేంద్రమైన కుభీర్ విఠలేశ్వర ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకొని గురువారం కుస్తీ పోటీలను ప్రారంభించడం జరిగింది. ముందుగా ఆలయ కమిటీ సభ్యులు గ్రామ సర్పంచ్ తో కలిసి విఠలేశ్వర ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి పోటీలను ప్రారంభించారు. ఈ పోటీలలో పాల్గొనే మల్ల యోధులు మహారాష్ట్ర లోని నాందేడ్ హిమాయత్ నగర్, బోకర్, మోత్కట్  తో పాటు అదిలాబాద్ ఉమ్మడి జిల్లాలోని తానుర్,ముధోల్, బైంసా గ్రామాల మల్లయోధులు అధిక సంఖ్యలో పోటిల్లో పాల్గొని ఈ పోటీల్లో గెలుపొందిన  మల్ల యోధులకు మొదటి బహుమతి 6వేలు రెండో బహుమతి 3వేలు నగదును  అందజేశారు. ఈ పోటీలను తిలకించేందుకు మండలంలో ఉన్న చుట్టుపక్క గ్రామాల ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని కేరింతలు కొట్టారు. ఈ పోటీల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కుబీర్ ఎస్ఐ శ్రీనివాస్ ఆధ్వర్యంలో  పోలీస్ బందోబస్తు చేపట్టారు. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ కందురు సాయినాథ్ ఆలయ కమిటీ అధ్యక్షులు పెంటజీ విజయ్ కుమార్, ఏశాల దత్తత్రి,  సూది రాజన్న గంగాధర్, గంగశేఖర్ నాగలింగం ఆలయ కమిటీ సభ్యులు గ్రామస్తులు వివిధ గ్రామాల నుంచి వచ్చిన మల్లాయోధులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -