Friday, March 20, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఘనంగా పాంచాంగ శ్రావణం

ఘనంగా పాంచాంగ శ్రావణం

- Advertisement -

– వేద పండితుడు బూరుగడ్డ సంపత్ కుమార్ ఆచార్యులచే నూతన పంచాంగం
– బ్రాహ్మణ కొత్త పెళ్లి గ్రామ సర్పంచ్ చిర్ర యాకాంతం గౌడ్
నవతెలంగాణ నెల్లికుదురు : మండలంలోని బ్రాహ్మణ కొత్తపల్లి గ్రామంలో శ్రీ సంతాన వేణుగోపాలస్వామి ఆలయంలో పరాభవ నామ సంవత్సర పంచాంగ శ్రవణాన్ని వేద పండితుడు శ్రీ బూరుగడ్డ సంపత్ కుమార్ ఆచార్యులు పంచాంగ శ్రావణ కార్యక్రమాన్ని నిర్వహించామని ఆ గ్రామ సర్పంచ్ చిర్ర యాకాంతం గౌడ్ తెలిపారు. గురువారం గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో గ్రామ ప్రజల సమక్షంలో నూతన పంచాంగం వినిపించే కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ సంవత్సరం కాలం ఏ విధంగా ఉంది ఎలా వచ్చింది ప్రజలు ఎలా ఉంటారు పంటలు ఎలా పండుతాయి ఇతర విషయాలపై గ్రామ ప్రజలకు సమగ్రంగా పంచాంగాన్ని పేరు బలగాలంపై చూసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ పిట్టల ఉప్పలయ్య వార్డు సభ్యులు ప్రజలు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -